ఒండుకున్నమ్మకి ఒకటే కూర దండుకున్నమ్మకి అన్నీ కూరలే వండుకుంటేఒక కూరే వండుకుంటారు, ప్రత్యేక కార్యక్రమం లేకపోతే. మరిక దండుకోవడమంటే? బలవంతంగా పుచ్చుకోవడం. అదెలా? రకరకాలు.'' వదినా కూరేం చేశావు?'' ''వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర''. అబ్బ ! ''మీ అన్నయ్య కెంత ఇష్టమో! మార్కెట్లో మంచి వంకాయే దొరకలేదనుకో''! వండుకున్నావిడ కొంచం కూర పె ట్ట క ఛస్తుందా? మరో చోటైతే మరో చిట్కా! ''నువ్వు పెట్టే నూనిమాగాయంటే మనపరగణాలో చెప్పుకుంటారనుకో!'' పొగేస్తే పెట్టక ఛస్తుందా? ''ఐపోవచ్చిందొదినా ఇదే మిగిలింది మళ్ళీ పెట్టాలి ఎండల్లో!'' ఇలా దండుకున్నావిడకి కూరల లోటుంటుందా? ఇందమ్మ అంటేనే అందమ్మ అంటారు. ఆదాన ప్రదానాలు జీవితంలో ఒక భాగమే! ఇవ్వాలి పుచ్చుకోవాలి, దానికి సమయం సందర్భమూ ఉండాలి. ఇచ్చేదానికి పుచ్చుకునే దానికి వెల చూడకూడదు, ఇవ్వడం వెనక మనసు చూడాలి.అలా చూడాలంటే పెట్టే మనసుండాలి. :) అదే ఇందమ్మ అంటే అందమ్మ అనడం కడుపులో లేనిది కావలించుకుంటే రాదు. కా వలించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? మసులో ప్రేమ ఉన్నపుడు. మనసులో ప్రేమలేక కావలించుకున్నంతలో ప్రేమ పుట్టదు :)
Post Date: Sun, 11 Dec 2022 04:08:35 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 11 Dec 2022 04:08:35 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment