Courtesy:Whats app కనుమ కనుమరోజు ప్రయాణం నిషిద్ధం. ఇవన్నీ సాంఘిక కట్టుబాట్లు, నాటి రోజుల్లో. కొన్ని నేటిరోజులకీ వర్తిస్తాయి.సనాతన ధర్మంలో కాలంతో పాటు అచార వ్యవహారాలూ మారుతూ వచ్చాయి, వస్తాయి,రావాలి కూడా! ఇవన్నీ అవసరానికి ఏర్పరచుకున్న కట్టుబాట్లు. శవదహనం మరుసటిరోజు:-నాటి రోజుల్లో శవదహనం అంటే శ్రమతో కూడినదే.కావలసినవారు కాలం చేసినపుడే వారింటికి వెళ్ళడం, దహనం దాకా ఉండడం జరుగుతుంది. అప్పటిదాకా ఆహారం తీసుకోరు కనక ఆహారం తీసుకుని శరీరానికి విశ్రాంతి ఇమ్మని చెప్పేదే ఈ ఆచారం. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు:- అగ్ని ప్రమాదం జరిగితే పూరిళ్ళు కనక ఎక్కువగా కాలిపోయి ఉంటాయి. ప్రమాద సమయంలో అలసట చెంది ఉండచ్చు, అంతే కాక మరుసటి రోజు పునరావాసం లో మన అవుసరం పడచ్చు, అందుకు విశ్రాంతికి, అవుసరానికి ఆదుకోడం కి అందుబాటులో ఊళ్ళో ఉండమన్నది. సపిండీ కరణం మరుసటిరోజు:- దీన్నే పన్నెండో రోజు తరవాత అనగా పదమూడో రోజు వెళ్ళకూడదు, పద్నాలుగో రోజు ఉండకూడదని చెబుతారు. అంటే పదమూడు ఉండకూ అంటే పన్నెండో రోజు భోజనాల అనంతరం నీ అవుసరం అక్కడలేదు, అందుకు వెళ్ళిపో! పదమూడో రోజు వెళ్ళకూడదంటే! అవును ఆ ఇంటికి అత్యవసరమైన వ్యక్తివి కనక ఉండిపోయావు, మిగిలున్న పనులు పదమూడో రోజు పూర్తి చేసి పదనాలుగో రోజు వెళ్ళిపో! అక్కడ ఉండకు అని చెప్పడమే! అవుసరానికి మించి ఉండద్దని చెప్పే ఆచారం. అమ్మవారి జాతర మరుసటిరోజు:- దీనికి తగిన కారణం చెప్పలేను.ఆ రోజుల్లో ఈ అవుసరం ఉండేదేమో! సంక్రాంతి మరుసటి రోజు:-ప్రతి నెల ఒక సంక్రాంతి జరుగుతూ ఉంటుంది.ఇది మకర సంక్రాంతి మరుసటిరోజుకు మాత్రమే పరిమితం. మకర సంక్రాంతి అనేది పెద్ద పండగ అనే పెద్దల పండగ. పెద్దల పండగ అంటారుగాని, ఇది అన్ని వయసులవారి పండగ. భోగి పిల్లల, అల్లుళ్ళ పండగ. సంక్రాంతిరోజు పెద్దలకి తర్పణాలు,దానాలు, ధర్మం ఇలా అందరిని సంతృప్తి పరచేరోజు.కనుమరోజు ప శు వులను కడిగి అలంకరిస్తారు.నాడు ప్రయాణ సాధనం బండి, పశువులు లాగేది. పశువులకి విశ్రాంతి ఇస్తూ వాటినీ ప్రేమిస్తూ చేసుకునే పండగ కనుక ప్రయాణం నిషిద్ధం. ముక్కనుమ:- స్త్రీల పండగ, బొమ్మలనోము, బొమ్మల కొలువూ, పేరంటాలు. కనుమ నా డు కాకయినా మునుగుతుంది అంటే కనుమ నాడు అభ్యంగన స్నానం చేయమని, దీనికి కారణాలు అనేకం.
Post Date: Mon, 16 Jan 2023 04:05:16 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 16 Jan 2023 04:05:16 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment