Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 9 February 2023

శ్రీరామకథ - తో చిత్రకావ్యాలు - ఏ.వి.రమణరాజు

శ్రీరామకథ - తో చిత్రకావ్యాలు సాహితీమిత్రులారా! శ్రీరామాయణగాథ ప్రభావం సాహిత్యప్రక్రియ లన్నిటిపై  ఉందనడం సత్యదూరం  కాదు. ప్రస్తుతం  అలాటి  రచనలలో చిత్రకావ్యాలను నామమాత్రంగ స్మరిద్దాం- శ్రీ మద్వాల్మీకి రామాయణం యుద్ధకాండలో----- శ్లో.మండలాని విచిత్రణి  స్థానానివివిధానిచ, గోమూత్రికాదిచిత్రాణి   గతప్రత్యాగతాని చ. - వా.రా.యుద్ధకాం,౪౦-౨౮ అనే శ్లోకంలో గోమూత్రికాబంధచిత్రవిశే షంవలె  సైన్యం యుద్ధం చేసినారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. వివిధకవిపండితులురామాయణాన్ని సంస్కృతంలో చిత్రకవనంలో రచించి నారు. ఆ  పేర్లు ---- కవిపేరు                      చిత్రరచనపేరు వేంకటేశ్వర         --రామయమకార్ణవః వేంకటేశ               --రామచంద్రోదయం గోపాలార్య           --రామచంద్రోదయం కృష్ణమోహన        --రామలీలామృతం శ్రీకాంత                       --రఘూదయం చిదంబరకవి        -శబ్దార్థచింతామణిః వేంకటాధ్వరి     --రాఘవయాదవీయం దైవజ్ఞసూరి --రామకృష్ణవిలోమకావ్యం శ్రీకాంత                     --రఘూదయం నారాణభట్ట     --నిరనునాసికచమ్పూః మల్లికార్జున     --నిరోష్ఠ్యరామాయణం వేంకటార్య--శ్లేషచమ్పూరామాయణ ధనంజయ-రాఘవయాదవపాణ్డవీయ చిదమ్బరకవి  -పంచకల్యాణచమ్పూః సన్ధ్యాకరనన్దినః           --రామచరితం సన్ధ్యాకరనన్దినః   - రాఘవయాదవపాణ్డవీయం వేంకటాచార్య-శ్లేషచమ్పూరామాయణ వేంకటేశ్వర-- చిత్రబన్ధరామాయణం వేంకటాచార్య-కంకణబన్ధరామాయణ కృష్ణకవి    --క్రియాగోపనరామాయణం కృష్ణరాయ        --ఆర్యాలంకారశతకం వీరరాఘవ      --విశేషణరామాయణం రామభద్ర                 --రామస్తవప్రాసః నిట్టలఉపమాక} వేంకటేశ్వర      } -రామాయణసంగ్రహః భాస్కరసూరి.           --సీతారామీయం సుబ్రహ్మణ్యసూరి        --రామావతారః సుబ్రహ్మణ్యసూరి      --సీతాకల్యాణం సుబ్రహ్మణ్యసూరి - రామాయణడోలగీత సుబ్రహ్మణ్యసూరి - ఆసేచనకరామాయణం వేంకటేశవామన   --రామచన్ద్రోదయం ముడుమ్బై వేంకట    }రామచన్ద్ర- రామనరసింహాచార్య}  కథామృతం డా.కే.ఎస్.రామానుజాచార్య--శ్రీరామబాణస్తవః ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనవి. తెలుగుచిత్రకవనం-రామాయణం: దశరథరాజనందనచరిత్ర(నిరోష్ఠ్యం)-- మరింగంటిసింగరాచార్య శుద్ధాన్ధ్రనిరోష్ఠ్యసీతాకల్యాణం--మరింగంటి సింగరాచార్యులు నిరోష్ఠ్యసీతాకల్యాణం   --పిడుపర్తి బసప్ప నిరోష్ఠ్యరామాయణం--సురపురంకేశవయ్య నిరోష్ఠ్యజానకీకల్యాణం--పోడూరి రామన శివరామాభ్యుదయద్వ్యర్థికావ్యం-- పోడూరి పెదరామామాత్య నిరోష్ఠ్యదాశరథిశతకం--మండపాక పేరయకవి నిరోష్ఠ్యదశరథతనయశతకం--వేదుల నారాయణకవి అచ్ఛాంధ్రనిరోష్ఠ్యనిర్గద్యదాశరథిచరిత్ర -- హనుమంతరాయశర్మ నిర్వచనభారతగర్భరామాయణం-- రావిపాటిలక్ష్మీనారాయణ గాదె పాపరాజు - చతుర్ముఖ రామాయణం నాదెళ్ల పురుషోత్తమకవి - చతుర్ముఖ కంద రామాయణం మొదలయినవి ప్రసిద్ధమైనవి వైద్యంవేంకటేశ్వరాచార్యులవారి సౌజన్యంతో
Post Date: Thu, 09 Feb 2023 14:00:31 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger