Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 13 February 2023

పన్ను పైపన్ను! - sarma

Photo Courtesy: linlin Smith పన్ను పై పన్ను! ప్రకృతి వింతలెన్నో! చూసేకన్నూ, మనసూ ఉండాలి. మానవులకి పళ్ళు పుట్టకతో ఉండవు. ఆరునెల ల మొదలు దశలవారీగా వస్తాయి. ఇవి పాలపళ్ళు.ఆరేళ్ళ మొదలు ఊడిపోయి వాటిస్థానంలో పళ్ళొస్తాయి. ఆ తరవాత పాతిక ముఫై వయసులో జ్ఞానదంతాలొస్తాయి. పళ్ళు దశలవారీగా ఊడిపోతాయి వయసుతో. ఎనభై దాటాకా మళ్ళీ పళ్ళొస్తాయంటారు, నిజమెంతో! బోసినోటి పాప చిరునవ్వే అందం! అందులోనే ఉంది అమ్మ వైభవం!! ఇలా పాలపళ్ళు ఊడిపోతున్న సమయంలో,ఊడిపోయినపంటి దగ్గర దురదతో గొలుక్కునేవాడిని నాలుకతో. ఇది చూసిన పెద్దలు, ఒరే అలా గొలుక్కోకు, కక్కిరాల అచ్చమ్మ పళ్ళలా ఎత్తుపళ్ళొస్తాయనేవారు. ఈ అచ్చమ్మ అనబడే ఆమె మా పక్కవీధిలో ఉండేది. అందరూ ఆమె ఎత్తుపళ్ళకి పరిహాసం చేసేవారు. మా వాళ్ళు ఇలా అటుండంతో, ఆమెను దీక్షగా గమనించా! ఆమెను చూసిన వెంఠనే అందవికారంగా ఉన్నటనిపించేది. నేను పరిశీలించి చూసి, ఆమె ఎత్తుపళ్ళు,ఆమె మొహంలో దరహాసాన్ని చూపిస్తున్నట్టు గమనించా! నాకేమీ తెలియని వయసుకూడా! కాని ఆమెకు చేతులు జోడించి నమస్కరించా! తల్లి ఆశ్చర్యపోయింది. అది మొదలు ఆమె కనపడితే నమస్కారం చేసేవాడిని. నేను ఆ తరవాత కాలంలో యాచన చేసి చదువుకున్నా! ఆ తల్లి నా నేటి స్థితికి కొంత కారణభూతురాలు కూడా! ఆ తరవాత కాలంలో నా పెద్దకూతురికి పైపళ్ళలో పక్క పన్ను, పన్ను పై పన్నుండేది. అమ్మకి నా పెంచినతల్లిపేరే పెట్టుకున్నా! అన్నపూర్ణ. అన్నపూర్ణే సదాపూర్ణే!  నాకూతురు కూడా చిరునవ్వు నవ్వుతున్నట్టే ఉండేది. చాలాకాలం తరవాత  మందస్మిత వదనారవిందయైన తల్లిని చూసా!!(పన్నుపైపన్ను ఉన్న అమ్మను చూసా)! ఇది, ప్రకృతి చిత్రం, అమ్మ వైభవం, అసంకల్పితంగానే చేతులు జోడించి నమస్కరించా!. పన్నుపైపన్నొస్తే అదృష్టం అంటారు,ఎందుకు?  వీరి మొహంలో ఎప్పుడూ చిరునవ్వు కనపడుతుంది.  పైపళ్ళలో పక్కపన్ను దొంతరపన్ను కావడంతో పైపెదవి కొంచెం పైకి లేస్తుంది. అది చిరుదరహాసానికి నాంది. ఆ పైపెదవి లేవడంతో కన్ను అరమూత పడుతుంది. అదీ పూర్తిగా దరహాసానికి పరాకాష్ట. ప్రతి స్త్రీలోనూ అమ్మవైభవం ఉంటుంది కాని వీరిలో అమ్మ వైభవం ప్రస్ఫుటంగా ఉంటుంది. అదికదా అదృష్టం! ఆపై ఈ తల్లి మాట మరింత అమ్మవైభవాన్ని తెలియజేస్తుంది. మాట మనుషుల్ని దగ్గర చేస్తుంది, మాటే మనుషుల్ని దూరం చేస్తుంది.  మరి అమ్మ వైభవం ప్రస్ఫుటంగా ఉన్న తల్లికి  చేతులెత్తి నమస్కారం! ''హత్తిన ప్రేమ జూపుటకు అమ్మయు, నాన్నయు నాకు కల్గగా నెత్తఱి నెంచి చూచినను నెక్కువ నేనని గౌరి పల్క; "నా కత్తయు మామగారు కల"రంచును నవ్విన శూలి నేర్పుకున్ బిత్తరి చూపులన్ నిలిచి "నేర్పరులే" యను గౌరి కొల్చెదన్ అల్పజీవి-అర్ధనారి. (శతకం నుండి, నా మిత్రులు) రచన:- విశ్వనాధం సత్యనారాయణ. "నాకు అమ్మా నాన్నా ఉన్నరోచ్" ఎలా చూసినా నేనే గొప్ప, అన్నది అమ్మ గౌరి, దాని శంకరులు "నాకు అత్తా, మామా ఉన్నారోచ్" అనగా అమ్మగౌరి "నేర్పరులే" అని బిత్తరి చూపులతో నిలబడిన తల్లి గౌరి నన్ను రక్షించు గాక. ( స్వయంభువువు,పుట్టుక లేనివాడు, తల్లితండ్రులు లేనివాడు శంకరుడు, అందుకు నాకు అత్తా, మామా ఉన్నారని చమత్కరించాడు) మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా! మందస్మిత ముఖారవిందయైన తల్లి లలితాదేవి నన్ను రక్షించుగాక!
Post Date: Mon, 13 Feb 2023 04:39:06 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger