Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 13 March 2023

మనసే జతగా పాడిందిలే - 27 - కవలపాటలు - మలరే...! మౌనమా...? అని పలుకుతున్నది ప్రాణమా? - Lalitha

గాయమైన ఎదకి హాయి పూయ గేయమొకటి తోడువచ్చె మోయలేని బాధ మాపు సేయ మాయ యేదొ తోడ తెచ్చె తోడు వచ్చిన పాట పొదవుకుంది పదము పదమున - మది తుళ్ళే పూలబాసలు... ఊరడించిన గీతి ఒదుగుకుంది అడుగు అడుగున - ఎద గిల్లే గాలిఊసులు... గుసగుసలుగ... హాయి తెచ్చిన పదము పొలుపున - ఎద గాయమది... మాయమయ్యె ఉసురుసురున... మాయ జేసిన పాట నెఱవున - మది హాయియది... సోలుపయ్యె *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** పూవు తూగేది గాలిలో ... పూవు నేల రాలేది గాలితో... గాలి తోటి చెప్పేదెలా జోరొద్దని? మనసు విరిసేది మాటతో ... మనసు విరిగేది మాటతో... మాట తోటి చెప్పేదెలా మీరొద్దని? గాలి జోరెక్కకుండా ఆపడమెవ్వరి తరం? మాట మీరొద్దని అనగలమెవ్వరం? అందుకే.... జరిగేది జరగనీ అనుకుంటా... జరిగేది ఏదీ ఆపబోననుకుంటా.... గాలికి రాలిన పూలకి దోసిలొగ్గుతా... మాటకి చెదిరిన గుండెకి పాట నేర్పుకుంటా! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ పూటకి నే ఏరికోరి తెచ్చుకున్న పాట - "మలరే ... మౌనమా!".   పాటున్న సినిమా తమిళ "కర్ణ".  పాటలో వున్నవారు - అర్జున్, రంజిత. ఇది  ఒక తీపిరాగాల మధుమంత్రం. ఎదను గిల్లు గాలిగానాల హాయిజంత్రం. ఈ పాటకి సంగీత దర్శకుడు - తెలుగులో అంతగా ఎవరూ తలుచుకోని విద్యాసాగర్. విద్యాసాగర్ ఎవరబ్బా అని కదా? అప్పుడెప్పుడో "ముగ్గురు మొనగాళ్ళు" లాంటి కొన్ని తెలుగు సినిమాలకి వృత్తిధర్మ-మాత్ర సంగీతం చేసి ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో మనోధర్మ-పాత్రమైన అద్భుతమైన పాటలు కూర్చిన  సంగీత-స్వర-మాంత్రికుడు. ఇంకా చప్పున ఈయనెవరో తలచుకుని-గుర్తు పెట్టుకోవాలంటే - ఇంకో పాట గురించి చెప్తా. నయనతార గాలిపటాలెగరేసి, రజనీకాంత్ పిల్లిగడ్డమెట్టుకుని లకలకలాడిన సినిమా ఒకటుంది చూశారూ? అదే... అందులో జ్యోతిక టార్చ్‌లైట్లలా వెలుగుతున్న కళ్ళ చుట్టూ ఇంత కాటుక పూసుకుని, జుట్టంతా పీక్కుని వినీత్‌తో కలిసి డాన్స్ చేస్తుందే - "రారా సరసకు రారా" అంటూ - గుర్తుందా? ఆ సిన్మా ఏదో మీరే కనుక్కోండి. ఆ పాటకు జాతీయపురస్కారం కూడా దక్కింది మన సంగీత-విద్యాసముద్రుడికి. అదే కాదు - కాశీనాథుని విశ్వనాథుడి "స్వరాభిషేకం" సిన్మాకి కూడా విద్యాసాగరుడే సంగీత-గంగావతరణ-భగీరథుడు. సంగీతం బావుంటుంది - కాకపోతే ఆ సినిమా నాకంతగా సొక్కలేదు. ఇవే కాకుండా - ఇంకో ఊరూపేరూ లేని  రీలుముక్క లాగా గాలికెటో కొట్టుకుపోయిన ఒకానొక  సినిమాలో ఒక అద్భుతమైన పాట వుంది ఈ  విద్యాసాగర్‌దే. దాని గురించిన కబుర్లు మళ్ళింకోసారి చెప్తా. ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఓ రెండు ముక్కలు చెప్పేసి ఆ ఇష్టాన్ని కొంచెపఱచుకోవడం నాకిష్టం లేదు. అన్నట్టు ఈ విద్యాసాగర్‌గారిది మా అమలాపురమేనట. భలే! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇహిప్పుడు - అసలు పాట  పాట గురించి. నేనిన్ని కబుర్లు చెప్తుంటాను కానీ - మా ఇంట్లో లేస్తూనే పాట వింటూ - చెవికి నచ్చిన పాటనల్లా పాడుకుంటూ - రాత్రి పాట వింటూ నిద్ర లోకి జారుకుంటూ - ఎప్పటికైనా తనకు నచ్చిన పాటలన్నీ పాడుకోవాలనుకునే వీర-పాటాభిమాని బద్రి. తను రకరకాల పాటలు వింటూ అందులో అనుకోకుండా దొరికిన మిణుకు-చుక్కల్లాంటి పాటల్ని పట్టి నాకిస్తూ వుంటారు. అలా దొరికిన బాల-గంధర్వ-జానకీ-మధురయుగళజనిత-గానమే ఈ "మలరే...మౌనమా?" పాట. వేణుగానంతో మొదలయ్యే విద్యాసాగరుడి మధుర సంగీతం... చెవికింపైన వైరముత్తు రాసిన తమిళ-పలుకులు... పాలూ-తేనె-మీగడ-పంచదార-నవ్వు-అచ్చర పరిచే అచ్చరపు పలుకు... అన్నీ కలిపి చిలికిన హాయిపాటల మా సుబ్బయ్య గొంతు... తోడుగా పాటకి తళుకు అద్ది, బెళుకు తొడిగి, జిలుగు కూర్చే ఎస్జానకి స్వరం... ఇన్ని కుదిరిన పాట ఇంపుగా కాక ఇంకెలాగుండగలదు? తమిళసలు పాటలో వున్న ఈ పూల-గాలి మాటలు నాకు బోల్డు నచ్చాయి. కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... ( గాలీ! నన్ను గిల్లెయ్యకూ ...) పూవే! ఎన్నై తళ్ళాదిరు... ( పూవా! నన్ను తోసెయ్యకూ!) అన్నట్టు ఈ పాటకి వెన్నెలకంటి రాసిన తెలుగు-డబ్బింగు కూడా బాగానే కుదిరింది. తెలుగులో పాడిన మనో గొంతులో కూడా చాలా బావుంటుంది. సర్సరే! ముందుగా తమిళసలుపాటకి, తెలుక్కొసరుపాటకి యూట్యూబు లింకులు ఇవిగో... మలరే... మౌనమా?!: https://www.youtube.com/watch?v=gRjKULlhot4 పలికే మౌనమా! : https://www.youtube.com/watch?v=Q1CR6a1_o2w *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** మలరే...! మౌనమా...? మౌనమే...  వేదమా...?! మలర్‌గళ్ - పేశుమా... ? పేశినాళ్ ఓయుమా... అన్బే! మలరే...! మౌనమా... ? మౌనమే...  వేదమా... ?! ఆ... పాది జీవన్ కొండు దేగం వాళ్న్దు వందదో... ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ ! మీది జీవన్ ఎన్నై పార్థ  పోదు వందదో...? ఏదో సుగం - ఉళ్ళూరుదే...! ఏనో మనం - తళ్ళాడుదే...! ఏదో సుగం - ఉళ్ళూరుదే...! ఏనో మనం - తళ్ళాడుదే...! విరళ్‌గళ్ తొడవా? విరుందై పెరవా? మార్బోడు కంగళ్ మూడవా...?! మలరే...! మౌనమా...? మలర్‌గళ్ - పేశుమా... ? కనవు కండె ఎందన్ కంగళ్ మూడి కిడందేన్... కాట్రై పోల వందు కంగళ్ మెల్ల తిరందేన్... కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... పూవే! ఎన్నై తళ్ళాదిరు... కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... పూవే! ఎన్నై తళ్ళాదిరు... ఉరవిల్  ఉరవే... ఉయిరిన్ ఉయిరే... పుదు వాళ్కై తంద వళ్ళలే....! మలరే...! మౌనమా...? మౌనమే...  వేదమా...?! మలర్‌గళ్ - పేశుమా... ? పేశినాళ్ ఓయుమా... అన్బే! మలరే...! మ్మ్ ... మౌనమా? మ్మ్... మౌనమే... మ్మ్ ... వేదమా?! ఆ... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** పలికే మౌనమా... మౌనమే వేదమా... పలుకే ప్రాణమా... ప్రాణమే బంధమా...ప్రియా! పలికే మౌనమా... మౌనమే వేదమా... ఆ... మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో -  ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ ! మనసు నీదే అని మరులు పూలు విచ్చె నో! ఏదో సుఖం శృతించగా... ఏదో స్వరం లిఖించగా... ఏదో సుఖం శృతించగా... ఏదో స్వరం లిఖించగా... ఒకటే ఎదగా ... ఒదిగే కధగా... ఒడిలోన ఊయలూగగా! పలికే మౌనమా... పలుకే ప్రాణమా... కలలు కన్న నా కనులు మూసుకొనెనే! కలిసిపోతే వయసింక మాట వినదే! గాలే ఎదే గిల్లేనిలా... పూలే సుధే చల్లేనిలా... గాలే ఎదే గిల్లేనిలా... పూలే సుధే చల్లేనిలా... చొరవే విడవా...? మనవే వినవా...? మధు మంత్రమేదో పాడవా! పలికే మౌనమా... మౌనమే వేదమా... పలుకే ప్రాణమా... ప్రాణమే బంధమా...ప్రియా! పలికే... మ్మ్ ... మౌనమా... మ్మ్ ... మౌనమే... మ్మ్ ... వేదమా... ఆ... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** పాటలు వింటూ, నే రాసిన పాటల-మాటలని మీ గొంతుతో పాడుకుంటూ పాటల-పండగ చేసుకుంటారని అనుకుంటూ.... ~ పాటల భైరవి
Post Date: Mon, 13 Mar 2023 03:59:24 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger