Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 23 March 2023

మీ మనోశోభ కృతమగుగాక - Lalitha

మనసులు కలిసొచ్చే కాలంలో గడిచే గడియ గడియకీ మిగిలేదొకటి - గుఱుతు ఎదిగేదొకటి - ఎఱుక ఆ గుఱుతు... ఒక ఉగాది ఆ ఎఱుక... ఒక ఉగాది కలిసిన మనసులు విచ్చే మేలంలో తరిగే రోజు రోజుకీ కలిగేదొకటి - పేరిమి కలిసేదొకటి - కూరిమి ఆ పేరిమి... ఒక ఉగాది ఆ కూరిమి... ఒక ఉగాది ఏడాదికేడాదికీ కొమ్మకొమ్మ చిగిర్చి రెమ్మరెమ్మ పూతలిచ్చి ఉల్లములుల్లాసంగా ఉగగా... ఉప్పొంగగా... పువ్వునవ్వు కన్న కన్ను - మినుమించు సోలుగాలి పలకరించిన మేను - పులకరించు ఆ ఉగ... ఒక ఉగాది ఆ పొంగు... ఒక ఉగాది యుగయుగాలుగా ఆద్యంతాలు అంతుపట్టని అనాదిగా ఏడాదికి ఆదిగా వెలుగుతున్న ఉగాది ఈ ఏడాదికి శోభకృతై మీ మదికి ఆనందాదియై మీ హృదికి సంతోషాదియై మీకూ మీ వారికీ మమతావారధై మీ జీవనం శోభావృతమై మీ మనోశోభ కృతమగుగాక
Post Date: Thu, 23 Mar 2023 04:20:46 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger