Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 2 March 2023

గతం గతః - sarma

గతం గతః పరమాత్మా! ఇన్నేళ్ళ జీవితంలో కష్టాలూ పడ్డాను, సుఖాలూ అనుభవించాను. తట్టుకోలేనంత కష్టం వచ్చినపుడు కుంగిపోయాను, పడిపోయాను, జీవితం ఐపోయిందనుకున్నా! కాని నీ లీల తెలియనిదే సుమా! కాలం దాటరానిదిన్నీ! "బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్...." నీవే నా బలం సుమా! కష్టాలొచ్చినప్పుడు ఏడ్చాను, ఇప్పుడూ వాటిని తలుచుకుని ఏడ్చి ఉపయోగం లేదు. ఏడిస్తే పోయినవాళ్ళు లేచొస్తారా? చంటిపాప నవ్వులో, మొక్కను పూసిన పువ్వులో, మంచిమనిషి హృదయంలో నువ్వున్నావని నమ్ముతున్నా. ఇరవై ఏళ్ళపుడున్న ఆరోగ్యం ఇప్పుడుంటుందా? ఉండదని తెలుసు. చివరిదాకా కాలూ,చెయ్యీ ఆడే, కదుపుకునే ఆరోగ్యం ప్రసాదించు, చాలు.   ఇప్పటిదాకా నాకు కావల్సినదానికంటే ఎక్కువే ఇచ్చావని నమ్ముతున్నా! నీ మీద భక్తి ఉన్నదని చెప్పుకోను, ఈ వయసులో పూజలు,వ్రతాలూ చెయ్యలేను,   నువ్వున్నావని నమ్ముతాను. నీ పాదకమల సేవయు, నీ పదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూతదయయును, తాపసమందార! నాకు దయ సేయగదే! నిన్నెప్పుడూ మరువని స్థితి ప్రసాదించు చాలు. చింతాకంతయు భక్తి నిల్వదుగదా శ్రీకాళహస్తీశ్వరా!
Post Date: Thu, 02 Mar 2023 03:51:53 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger