ఇది జిజ్ఞాసువు ప్రశ్న. దేవునిగురించి ఎవరికివారు తెలుసుకొవలసిందేగాని మరొకరు ఎఱుక పరచలేరన్నది నానమ్మిక.దీనిపై అంతులేని ప్రశ్నలు, అనంతమైన సమాధానాలూ ఉన్నట్టున్నాయి, నేడో రేపో కమే కూడా దీనిమీద సిద్ధాంతం రాసెయ్యచ్చు. ఈ నెల రెండో తారీకు మొదలు రొంప,దగ్గు,జ్వరం నన్ను సిరి పీడించినట్టు పీడిస్తున్నాయి, వదలక. దీనికి తోడు నాలుగురోజులుగా వేడి దంచుతోంది, నలభై లెక్కన. నా కష్టాలు పరమాత్మకే ఎఱుక.ఇంతలోనూ కొంచం ఓపిక జేసుకుని..ఇది గిలికా... పల్లెటురివాణ్ణి,చదువు లేనివాణ్ణి, మట్టిలో బతికే మనిషిని, మేధావినికాను.ఇది నా అనుకోలు, పెద్దలు మన్నించెయ్యండి,తప్పుల్ని. ప్రశ్నలోనే ఇద్దరున్నట్టుకదా? ఇద్దరుంటే కదా ఒకరినొకరు పట్టుకోడం? ఎవరిని ఎవరు పట్టుకోవాలన్నది ప్రశ్న. విషయంలో కెళదాం. మార్జాలకిశోరన్యాయం, మర్కటకిశోర న్యాయమన్నవి రెండు సామెతలు, సంస్కృతంలో. మొదటిదానిలో పిల్లి తన పిల్లను నోటకరచుకుపోతూ ఉంటుంది.పిల్లకి బాధ్యతలేదు. అంతా తల్లి చూసుకుంటుంది. రెండవది దీనికి విరుద్ధం. అందులో తల్లికోతి వీపును పిల్ల పట్టుకు ఉంటుంది.తల్లికేం బాధ్యతలేదు. పిల్లబాగోగులు పిల్ల చూసుకోవాలంతే! ఈ రెంటినీ సమన్వయ పరచుకుంటే!ఎలా? భాగవతం దగ్గరకెళదాం.ప్రహ్లాదోపాఖ్యానం లో ప్రహ్లాదుడు హరి నామాన్ని పట్టుకున్నాడు. ఎలా? పానీయంబులుద్రావుచున్,కుడుచుచున్,, హాస నిద్రాదులు జేయుచున్, అన్నీ చేస్తూ కూడా నామం పట్టుకున్నాడు.మర్కటకిశోర న్యాయంలా. కష్టాలొచ్చాయి, ఎంతదాకా పీకలదాకా,హిరణ్యకశిపుడు ఇలా ఏడ్చేదాకా ముంచితి వార్ధులన్ గదలమొత్తితి .......జావడిదేమి చిత్రమో అనుకుని ఏడ్చేదాకా! ఎవరు పట్టుకున్నారు ప్రహ్లాదుని? హరి పట్టుకున్నాడు మార్జాలకిశోర న్యాయయంలో లా. దీన్ని బట్టి తెలిసేదేమి? నువ్వు పట్టుకో! నిన్ను పట్టుకుంటా!!
Post Date: Thu, 13 Apr 2023 03:26:24 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 13 Apr 2023 03:26:24 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment