Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 1 May 2023

అని, అనిపించుకోడం.... - sarma

అని, అనిపించుకోడం అత్తగారూ నీకలవాటు. ఇదొక నానుడి,తెనుగునాట బాగా చెప్పుకునీదిన్నూ!!  అత్తగారంటే సాధించేదనీ,వేధించేదనీ,బాధించేదనీ..... కొడుక్కి పెళ్ళిచేస్తే కోడలొస్తుంది,అప్పుడే అత్తరికమూ వస్తుంది. అత్తయ్యేటప్పటికి వయసూ మళ్ళుతూ ఉంటుంది, కోడలివి వచ్చేరోజులు అత్తవి పోయే రోజులూన్నూ. పాతరోజుల్లోలా అత్త అథారిటీ చెలాయిస్తానంటే కుదురుతుందా!!!! కుదరకపోవచ్చు. మరేం చేయ్యాలి? అదిగదా కొచ్చను? గౌరవం నిలబడాలంటే అత్త తగ్గి ఉండటం మంచిది కదా!!!!!  కాదు పాతరోజుల్లో లా అథారిటీ చెలాయిస్తానంటే ఎలా? ఇప్పటిరోజుల్లో మాటంటే కోడలూరుకుంటుందా? ఒకమాటంటే తనూ మరోమాటంటుంది, అంతే! తమలపాకుతో నీ వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా, అని చేతలకి కూడా దిగచ్చు. తెనుగింటి అత్త అంటే ఎలావుంటుందంటే "సూరేకాంతా"న్నే చెప్పుకోవాలి.అత్తపాత్రలో అంతగా ఇమిడిపోయి నటనలో జీవించిన నటి మరొకరు నేటికిన్నీ లేరు,లేరు,లేరు.ఇంతటి దుష్టపాత్రల్ని పోషించినామె మనసువెన్ననీ, షూటింగ్ సమయంలో అందరికి తాను ఇంటి దగ్గర స్వయంగా చేసి తెచ్చిన తినుబండారాలు పంచిపెట్టేదని నేటికిన్నీ చెప్పుకుంటూ ఉంటారు.    అత్తని తలుచుకుంటే సూరేకాంతాన్ని తలుచుకోకపోవడం పాపం.అత్తరికం వెలగబోయడం  వ్యక్తులకే కాదు దేశాలకీ వర్తిస్తుందిష. పరోపదేశసమయే జనాః సర్వేఽపి పండితాః తదనుష్ఠానసమయే మునయోరఽపి న పండితాః ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో మాదే గొప్ప దేశమని డబ్బా కొట్టుకునే అమెరికా ఈ మధ్య ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, ఏమనీ? మీ దేశంలో గుజరాత్ కోర్ట్ రాహుల్ గాంధీ పై ఇచ్చిన తీర్పును గమనిస్తున్నామూ, అని. ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటూ ఇతరదేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడమేమీ? అడిగేరు కొందరు. ప్రజాస్వామ్యదేశాలలో జరిగేవాటిని గమనిస్తుంటాం! అంతేగాని అది ఆ దేశపు విషయాలలో జోక్యం కాదూ, అని సెలవిచ్చేరు. సరి! ఇలాటివి ఆ దేశానికి కొత్తకాదు, మొదటిసారికాదు.  తెచ్చిపెట్టుకున్న అత్తరికం వెళ్ళబోయడం ఈ దేశపు అలవాటూ! ఇది కొత్తాకాదు. ఇలా జరుగుతున్నందుకు ఆ దేశాలూ గట్టిగా సమాధానాలూ చెప్పటంలేదు, కారణాలు తెలిసినవే! కోడలికి కూడా రోజొస్తుందికదా! అలాగే భారతదేశానికీ రోజొచ్చింది. మీదేశంలో మాజీ ప్రెసిడెంటును కోర్టులో అరెస్టు చేసిన విషయం గమనిస్తున్నామని చెప్పి బదులు తీర్చేసేరు.  అంచేత అని అనిపించుకోవడం అత్తగారి లక్షణమనుకోవాలా?
Post Date: Mon, 01 May 2023 03:16:35 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger