పృధివ్యా త్రీణి రత్నాని (ఆచార్య చాణుక్య) పృధివ్యా త్రీణి రత్నాని జలమన్నం సుభాషితమ్ మూఢే పాషాణఖండెషు రత్నసంజ్ఞా విధీయతె భూమి మీద విలువైనవి మూడే!అవి నీరు,అన్నం,సుభాషితమున్నూ. మూర్ఖులు రాతి ముక్కలని రత్నాలని భ్రమిస్తారు. అన్నము,నీరు,సుభాషితము (ఇవే రత్నాలంటారు కవి) ప్రాణాలు పోస్తాయి.రత్నాలనుకునే రాతి ముక్కలు ప్రాణాలు తీస్తాయి. రాతి ముక్కల్ని రత్నాలనుకుని మూఢులు భ్రమపడతారని చాణుక్య ఉవాచ. శైలె శైలె న మాణిక్యం మౌక్తికం న గజె గజె సాధవో న హి సర్వత్ర చందనం న వనె వనె అన్ని పర్వతాలోనూ మాణిక్యాలు దొరకవు.అన్ని ఏనుగులలోనూ ముత్యాలు దొరకవు ( ఏనుగు కుభస్థలంలో ముత్యాలుంటాయని ప్రతీతి).సాధకులు ప్రతిచోట ఉండరు.చందనపు చెట్లు అన్ని అడవుల్లోనూ ఉండవు. గొప్పవైనవన్నీ కొన్ని చోట్లమాత్రమే ఉంటాయని కవిగారి మాట రాజా వేశ్యా యమశ్చాగ్ని తస్కరో బాలయాచకో పరదుఃఖం న జానంతి అష్టమో గ్రామకంటకః రాజు,వేశ్య,యముడు,అగ్ని, దొంగలు,బాలలు,యాచకులు వీరంతా ఇతరుల కష్టం గుర్తించరు. ఎనిమిదోవాడు గ్రామీణుడు.(పల్లెటూరి బైతు) విద్వాన్ ప్రశస్తతె లోకె విద్వాన్ గఛ్ఛతి గౌరవమ్ విద్యయా లభ్యతె సర్వం విద్యా సర్వత్ర పూజ్యతె విద్వాంసుడిని లోకం పొగుడుతుంది.విద్వాంసుణ్ణి లోకం గౌరవిస్తుంది. విద్యతో సర్వం లభిస్తాయి. విద్యను సర్వత్రా పూజిస్తారు. విద్యలేనివాడు వింత పశువని తెనుగుమాట. అనాహూతః ప్రవేశతి అపృష్ఠో బహు భాషతె అవిశ్వస్తె విశ్వసతి మూఢచేతా నరాధమః పిలవక వచ్చేవాడు,అడగకనే అనవసరంగా అనర్గళంగా మాటాడేవాడు,నమ్మకూడనివారిని నమ్మేవాడు,పనికిరానివాడు, మూర్ఖుడు. **** పక్షిణా బలమాకాశం మత్స్యానాముదకం బలం దుర్బలస్య బలం రాజా బాలానం రోదనం బలం పక్షికి ఆకాశం బలం.చేపకు నీరు బలం. దుర్బలులకు రాజు బలం. బాలలకు రోదన బలం. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బైట కుక్క చేత భంగ పడును స్థానబల్మిగాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ! వినుర వేమ!
Post Date: Sat, 01 Jul 2023 03:25:20 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 01 Jul 2023 03:25:20 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment