Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 11 July 2015

పుష్కరాల వైశిష్ట్యం ... మరో 4 వెన్నెల వెలుగులు

పుష్కరాల వైశిష్ట్యం ... మరో 4 వెన్నెల వెలుగులు


పుష్కరాల వైశిష్ట్యం

Posted: 11 Jul 2015 08:51 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పోషయతి ఆపః జీవయతీతి పుష్కరః అని సంస్కృత నిర్వచనం. నదీజలాలను పోషించేవాడు, వాటికి శక్తినిచ్చి రక్షిస్తున్నవాడు పుష్కరుడు.

పూర్వం తుందిలుడనే ఒకరు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. అతడి తపస్సుకు శివుడు మెచ్చి తన అష్టమూర్తి తత్వంలో ఒకటైన జలతత్వానికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నీటికి పవిత్రతను ఇవ్వగలవాడిగా పుష్కరుడయ్యాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించే ముందు తనకు ఈ పుష్కరుడు కావాలని శివున్ని కోరగా, శివుడు అనుమతిచ్చాడు. పుష్కరుడు బ్రహ్మగారి కమండలంలోకి చేరాడు. ఈ పుష్కరుడు ఎంత గొప్పవాడంటే అహల్యను చెరబట్టి గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడికి చర్మవ్యా... పూర్తిటపా చదవండి...

త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మేనా..!

Posted: 11 Jul 2015 07:36 AM PDT

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

అవును.. త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మే అని నిరూపించారు డాక్ట‌ర్ రాఘ‌వేంద్రరావు. స‌ర్వేంద్రియాణాం అవ‌యవం ప్రధానం అనుకోవ‌చ్చు. ఎందుకంటే మాన‌వ శ‌రీరంలో అన్ని అవ‌యవాల‌కు ఆయా ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొన్ని అవ‌య‌వాల విష‌యంలో మాత్రం ఎక్కువ ప్రధానం అనుకోవాలి. ఎందుకంటే ఈ అవ‌య‌వాలు..త‌మ ప‌నితీరులో విఫ‌... పూర్తిటపా చదవండి...

వృధా

Posted: 11 Jul 2015 05:46 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
పూలలాంటి కాంతిలో తను.

తెరచిన తలుపులూ, కిటికీలూ, గాలికి కదిలే ఆకులూ, ఎగిరే పక్షులూ
మరి ఎక్కడి నుంచో పిల్లలు నవ్వే సన్నటి సవ్వడి
బాల్యంలోని అమ్మని గుర్తుకు తెచ్చే గాజుల అలికిడి -

చీకటిలాంటి అశాంతిలో అతను.

గోడలపై కదిలే నీడలని మెత్తగా తాకుతూ వాటితో మాట్లాడుతూ, బహుశా
నీకు చెప్పలేని నా లోపలి మాటలతో, రహస్యాలతో
నువ్వు చూడలేని ఉద్యానవనాలలోని పరిమళంతో -

ప్రేమలాంటి ఒక అస్పష్టతలో ఇద్దరు.

రెండు తీరాలను కలిపే కలలు. ఊరికే నిన్ను తాకి ఆనందించే పిల్లలు.
వాళ్ళ ముఖాలలో ప్రతిఫలించే వెలుతురూ, ఊరక... పూర్తిటపా చదవండి...

కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే ఏమి చేయాలి

Posted: 11 Jul 2015 02:55 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : Kaalla pagullu povalante emi cheyali,beauty in telugu, beauty tips, Cracked, Cure, Feet, Health, Health tips, kalla andam, padalu, pagullu, telugu,Simple home tips for Foot Care,FOOT CARE TIPS,Buatyful Foot Tips In Telugu,Foot Care Tips,Homemade remedies for cracked heels, home remedies cracked heels, Glycerin, Take Paraffin wax, paraffin oil, Vaseline, hydrogenated vegetable oil,, Homema... పూర్తిటపా చదవండి...

కాలం… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

Posted: 11 Jul 2015 01:19 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ క్రూరమైన కాలమా! నీ పరుగు పూర్తయేదాకా పరిగెత్తు.
బరువైన సీసపు లోలకపు గమనాన్ని పోలిన వేగంతో
నీరసంగా అడుగులువేసే ఘడియల్ని నీ వెంట తీసుకుపో;
నీకు దొరికే ఆ నశ్వరమూ, నిరుపయోగమైన
వాటితోనే నీ పొట్ట పగిలేలా సుష్టుగా ఆరగించు
అదంతా కేవలం క్షణభంగురమైన వ్యర్థము.
మేము పోగొట్టుకున్నదీ  లేదు
నువ్వు బావుకున్నదీ లేదు.
ఎందుకంటే, ఒక్కొక్క పనికిమాలిన వస్తువునీ
అంకించుకుంటూ, చివరకి నిన్ను నువ్వే ఆరగించుకున్నాక
అనశ్వరమైన బ్రహ్మానందం మాకోసం నిర్రిక్షిస్తుంటుంది
ఒక్కొక్కరికీ ఆత్మీయమైన ముద్దు పెడుతూ;
సంతోషం వరదలా మమ్మల్ని ముంచెత్తుతుంది.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger