Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 18 May 2016

మననం ... మరో 1 వెన్నెల వెలుగులు

మననం ... మరో 1 వెన్నెల వెలుగులు


మననం

Posted: 18 May 2016 07:52 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే, మరి
***
చేజారి, ఒక దీపం పగలిపోయి ఉండవచ్చు. ఎవరిదో ఒక
హృదయం ఆరిపోయి ఉండవచ్చు -
వాన చినుకై ఒక ముఖం, రాత్రిలోకి అశ్రువై, రాలిపోయీ
ఉండవచ్చు. చివరికి బాహువులు

అనాధాలై, నీకు ఏమీ విప్పి చెప్పుకోలేక, తమలోకి తామే
బెంగతో ముడుచుకుపోయి ఉండవచ్చు
దిక్కు తోచక విలవిలలాడీ ఉండవచ్చు -
***
చూడూ, మరి అందుకే, కొన్నిసార్లు
ఊరికే వాళ్ళకై అట్లా ఉండు: కనులపైని నీటిపొరలాంటి
దయతో, ఇంకొంచెం ఓరిమితో-!
... పూర్తిటపా చదవండి...

నాలుగు మానసిక శక్తులు:

Posted: 18 May 2016 04:33 AM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
అనుభవాన్ని చూసే శక్తి, తీసుకొనే శక్తి, నిలుపుకొనే శక్తి, వ్యక్తీకరించే శక్తి అని నాలుగు ఉంటాయనిపిస్తుంది.

అనుభవాన్ని తీసుకొనే చూపు ఎంత విశాలమైతే, సూక్ష్మమైతే, లోతైనదైతే అంతగానూ అనుభవం నాణ్యత ఉంటుంది. ఆ చూపు వికసించటంపైనే దృష్టి నిలిపినవారు, జీవితమంతా పసిపిల్లల్లా నేర్చుకొంటూనే, వికసిస్తూనే ఉంటారు. వీళ్ళే మానవాళికి ముందు నడుస్తారు. పువ్వులో అరణ్యాన్నీ, ఇసుకరేణువులో ఎడారినీ చూడాలని ఒక కవి అంటాడు కదా.

ఇక, అనుభవాన్ని తీసుకోవాలంటే మనసులో తగినంత ఖాళీ ఉండాలి. ఆశ్చర్యపడే గుణం ఉండాలి. తాను అనుభవంలోకి ఇంకిపోయే అమాయకత్వం ఉండాలి. మనుషులు నిజాయితీ గలవార... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger