Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 15 July 2014

సరిక్రొత్త బ్లాగు ర్యాంకింగ్ విధానం రాబోతుంది

బ్లాగిల్లు ఉత్తమ బ్లాగులు ర్యాంకింగ్ విభాగంలో మార్పులు చేయబడుతున్నవి. ప్రస్తుతం ఉన్న విధానం పూర్తిగా మార్చబడును.
ప్రస్తుతం ర్యాంకింగ్ చేయబడుతున్న విధానం :
1 బ్లాగిల్లు ద్వారా పంపబడే కోడ్ ఆ బ్లాగుయొక్క రోజువారీ బ్లాగు వీక్షకుల సంఖ్యను తీసుకుని ఆ బ్లాగు బ్లాగిల్లులో నమోదు చేయబడిన సమయం నుండి ప్రతీరోజూ వాటిని కలిపి సరాసరి తీస్తుంది .
2. ఆ బ్లాగుకు వచ్చే రేటింగ్ లను పరిగణలోకి తీసుకుంటుంది .
 పై రెండింటి ద్వారా గణించి ఒక స్కోర్ ఇస్తుంది . దాని ప్రకారం ర్యాంక్ అనుక్షణం మార్పు చెయబదుతున్నది. ఈ ర్యాంక్ పూర్తిగా వీక్షకుల సంఖ్య  ఆధారంగా చేయబడుతున్నది . ఒక బ్లాగు కనుక ప్రతీరోజూ ఒక టపా అన్ని సంకలినులలో వచ్చేలా ప్రచురించబడితే ఆ బ్లాగు ర్యాంక్ పెరగడానికి ఎక్కువ  పట్టదు. ఒక వేళ  అదేబ్లాగులో కొద్ది రోజులపాటు టపా వ్రాయకపోతే ఆ బ్లాగు ర్యాంక్ క్రమేణా క్షీణిస్తుంది .
పై ర్యాంకింగ్ విధానంలో ఏ మాత్రం లోపం లేకపోయినా ఇది పూర్తిగా వీక్షకుల ఆధారంగా గణించే ర్యాంక్ అని అందరికీ తెలుసు.
ఇక త్వరలో ప్రవేశ పెట్టబోతున్న నూతన విధానం ప్రకారం ఒక్క వీక్షకుల సంఖ్య మాత్రమె కాక అనేక అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి . కొన్ని అంశాలు చెపుతాను -
  • బ్లాగుకు  ర్యాంక్ విధానం కాక స్కోరింగ్ విధానం ఇవ్వబడుతుంది . 0 - 100 స్కోర్ ఇవ్వబడుతుంది . ఒకే స్కోర్ చాలా బ్లాగులకు ఇచ్చే అవకాశం  ఉంది . ర్యాంకులో మార్పు ప్రతీ రోజూ కాక  నెలకోసారి ఒక్కోసారి 10-15 రోజులకూ కూడా ఇది జరుగవచ్చు . 
  • ఈ గడువులో బ్లాగులోవచ్చిన  టపాల సంఖ్య, క్వాలిటీ ( స్వచ్చత ) ,ఆయా టపాలకు వస్తున్న  కామెంట్లు , పరిగణలోకి తీసుకోబడుతాయి . 
  • ఈ గడువులో ఆ బ్లాగుయొక్క గూగుల్ పేజి ర్యాంక్ , అలెక్షా ర్యాంక్ ఇంకా కొన్ని ఇతర ర్యాంకులలోని మార్పులు పరిగణించ బడుతాయి .
  • ఆ బ్లాగుకు గూగుల్, బింగ్ , యహూ మరియు ఇతర సెర్చ్ ఇంజన్లలోని లింకుల సంఖ్య మార్పు పరిగణించబడుతుంది. 
  •  Siteliner, Copyscape  లాంటి వాటితో ఈ బ్లాగులోని సమాచార నాణ్యత పరీక్షించబడుతుంది.
  • కొన్ని ఇతర అంశాలు ( ఇందులో కొన్ని సీక్రెట్) పరిగణలోకి తీసుకోబడుతుంది.
  • పైన చెప్పబడిన అంశాల్లో చాలామటుకు మాయొక్క ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ( దీనికి తెలుగు పేరు పెట్టాలి) ద్వారా జల్లించబడి, శోధించబడి రాంకింగ్ ఇస్తాయి.
  • మాన్యుయల్ గా సేకరించబడిన వివిధ అంశాలద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఆ బ్లాగుకు స్కోర్  ఇవ్వబడుతుంది .
 ఇప్పడు మీకు సాధారంగా వచ్చే సందేహాలను చూద్దాం ;;;--

ఇప్పటి ర్యాంకింగ్  విభాగం ఏమవుతుంది ?
పూర్తిగా రద్దవుతుంది.
మరి ప్రస్తుతం బ్లాగులో ఉంచిన విడ్జెట్  కోడ్ ఏమి చేయాలి ?
దయచేసి ఆ కోడ్  తొలగించండి .
దీనికి గడువు ఉందా ?
అవును. ఆ తేదీ త్వరలో తెలియ చెస్తాము.
పాత ర్యాంకింగ్ విభాగంలో నమోదు చేసుకున్నవారు మరల క్రొత్తగా నమోదు చేసుకోవాలా ?
ఈ విషయం ఆలొచిస్తాము. చేసుకున్నా ఏ  ప్రాబ్లం లేదు.
పాత వాడుకపునామం , పాస్ వర్డ్ పనికివస్తాయా ? 
ఈ విధానంలో మీకు ఏ విధమైన అకౌంట్ ఉండదు . కనుక పాస్ వర్డ్ అవసరమే రాదు.
ఈ ర్యాంకింగ్ ఆటోమేటిక్ గా చేయబడుతుండా మాన్యువల్ గానా ? 
 దీనికి వివిధ మార్గాలద్వారా తీసుకోబడే డేటా ఆటోమేటిక్ గా క్రోడీకరించబడుతుంది . తర్వాత దానికి కాస్త మా వద్దనున్న డేటా కలిపి మాన్యువల్ గా స్కోరింగ్ ఇవ్వబడుతుంది.
ఈ స్కోరింగ్ కు విడ్జెట్ ఉంటుందా ? 
 అవును. ఈ విభాగంలో నమోదు చేసుకున్న తర్వాత మీకు విడ్జెట్ కోడ్ పంపబడుతుంది. దాన్ని మీ బ్లాగులో ఉంచాలి .
ఈ విభాగం నుంచి నా బ్లాగును తొలగించాలంటే ఎలా ? 
మీ బ్లాగు వివరాలతో మాకు ఓ మెయిల్ చేయండి చాలు .
ఒక్కొక్కరూ ఎన్ని బ్లాగులు నమోదు చేసుకోవచ్చు ? 
ఎన్నయినా
ఇచ్చిన విడ్జెట్ కోడ్ తప్పక జతచేసుకోవాలా ? 
అవును . మినహాయింపు గురించి తర్వాత చెపుతాను.
ఇప్పటిలాగే వీక్షకుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకోవచ్చా ? 
కుదరదు. వీక్షకులసంఖ్య తెలుసుకోడానికి వీలు పడదు.
ఇతర సదుపాయాలేమైనా క్రొత్తగా ఉన్నాయా ? 
అవును. తర్వాత అవి చెపుతాను.
నాకు కొన్ని ఐడియాలు ఇన్నాయి చెప్పనా ? 
ఆలస్యం ఎందుకు మరి... క్రింది లింకులో మీ కామెంట్లు జతచేయండి.

కామెంట్లకు లింకు : http://blogillu.blogspot.com/p/blog-page_7.html
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger