Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 4 February 2015

ఆ ఇల్లు ... మరో 5 వెన్నెల వెలుగులు

ఆ ఇల్లు ... మరో 5 వెన్నెల వెలుగులు


ఆ ఇల్లు

Posted: 04 Feb 2015 07:57 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు ఇప్పుడు
పాతబడిపోయింది ఆ ఇల్లు ఇప్పుడు
తలారబోసుకునే ఒక ముసల్ధానిలా, మగ్గిపోయి రాలిపోయే వేపాకులతో
వొంటరిగా నిలబడి ఉంటుంది ఆ ఇల్లు-

రంగులు వెలసిపోయిన గోడలూ, ఆవరణలో
పగిలిన పలకలూ, చెవులు రిక్కించి, మరి నీ
చేతి కోసమో, నీ మాట కోసమో ఒక ముదుసలి వలే ఎదురుచూస్తూ, గాలికి
బడబడా కొట్టుకునే గేటూ, అలజడిగా కదిలే

నీడలూ, మొక్కలూ, వీధుల్లో రికామీగా అరుస్తూ పిల్లలు -

నిజం.
నువ్వు వెళ్ళని ఆ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు.

సాయంకాలపు ఎండ వాలిన గరకు చర్మం లాంటి
చికిలించిన కళ్ళ చుట్టూ ఏర్పడిన గీతల్లా... పూర్తిటపా చదవండి...

తెలుసు! .... సాధ్యం కాదని,

Posted: 04 Feb 2015 07:05 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

తెలుసు,
ఒక విరిగిన గుండె నయం కాదని
అవగాహనే లేకపోతే
ఆ విరిగిన భాగాలను కలిపి కుట్టలేము... పూర్తిటపా చదవండి...

CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి

Posted: 04 Feb 2015 05:26 AM PST

రచన : వీవెన్ | బ్లాగు : వీవెనుడి టెక్కునిక్కులు
వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం. జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS ::first-letter సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది. ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు: […]పూర్తిటపా చదవండి...

ప్రేమకు మరోవైవు

Posted: 04 Feb 2015 05:00 AM PST

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....

నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడు
వారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్ని ప్రేమించగలగాలి,
తప్పుల్ని క్షమించగలగాలి,
వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు 
వారి కోపాల్ని కూడా భరించగలగాలి,
వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి
ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో ఉన్నపుడు కూడా తోడుండాలి
ప్రేమించబ... పూర్తిటపా చదవండి...

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –ఉయ్యూరు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం –ఆహ్వానం

Posted: 04 Feb 2015 01:48 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –ఉయ్యూరు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం –ఆహ్వానం

 
శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –ఉయ్యూరు

సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం –ఆహ్వానం

అతి పవిత్రమైన మాఘ బహుళ ఏకాదశి 15–2-15 ఆదివారం ఉదయం 9-30 గం లకు  శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో స్వామి వారల సన్నిధిలో  ''సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ''నిర్వహింప బడుతోంది .ఆసక్తి ఉన్న భక్తులు ఈ  వ్రత కార్యక్రమం లో పాల్గొని అభీష్ట సిద్ధిని పొంద వలసినదిగా కోరుతున్నాం .వారు ఆలయ ధర్మ కర్తను ,అర్చకస్వామి ని ఫోన్ లో సంప్రదించి లేక స్వయం గా కలిసి  తమ పేర్లను నమోదు చ... పూర్తిటపా చదవండి...

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 4

Posted: 04 Feb 2015 12:32 AM PST

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
Continuation

భగవంతుని పైపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger