Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 20 March 2015

భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు.

Posted: 19 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.  



సమస్య - భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు. .



తేటగీతి:
అల జరాసంధు జంపగా నరిగె నపుడు
పుణ్యపురుషులు మువ్వురు భూసురులుగ
కపట వేషమ్ము లనుదాల్చి కవ్వడియును
భీమసేనుండు, దేవకీ ప్రియసుతుండు. .
... పూర్తిటపా చదవండి...

నీ ఉనికికి దోహదం చేసే వాళ్ళతో తిరుగు … రూమీ, పెర్షియను కవి

Posted: 19 Mar 2015 02:48 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నీ అస్తిత్వానికి దోహదం చేసే వాళ్లతో తిరుగు
అంటీ ముట్టనట్టు ఉండేవాళ్లతో వొద్దు;
వాళ్ల ఊర్పులు నోటంట నీరసంగా వస్తాయి;
ఈ దృశ్య ప్రపంచంతో కాదు,
నీ బాధ్యత చాలా గంభీరమైనది.

గాలిలోకి ఎగరేసిన మట్టి  ముక్కలై రాలిపోతుంది.
నువ్వు ఎగరడానికి ప్రయత్నించకపోతే,
ఎగిరి నిన్ను అలా ఖండ్ఖండాలుగా చేసుకోకపోతే,
మృత్యువే నిన్ను ముక్కలుముక్కలు చేస్తుంది,
అప్పుడు నువ్వు ఏదవుదామనుకున్నా సమయం మించిపోతుంది.

ఆకులు పండిపోతాయి. చెట్టు కొత్త వేరులు తొడుగుతుంది
ఆకుల్ని పచ్చగా మార్చుకుంటుంది.
నీకింకా పండి పాలిపోయిన ప్రేమపట్ల సంతృప్తి ఎందుకు?
.... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 854

Posted: 19 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"వీడ్కోలు"
... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – భద్రిరాజు కృష్ణమూర్తి గారు

Posted: 19 Mar 2015 10:59 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ భాషావేత్త, రచయిత శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారి రచనల ముఖచిత్రాలు ఒకసారి గమనిద్దాము అలాగే కృష్ణమూర్తిగారిపై "సాహితీ స్రవంతి" సాహిత్య మాస పత్రికలో (2012) వచ్చిన డా. పోరంకి దక్షిణామూర్తి గారి వ్యాసం కూడా చూద్దాము. 

గాథాసప్తశతి - 1

Posted: 19 Mar 2015 10:30 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం.  గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము,  ప్రకృతి సౌందర్యం, ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger