Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 29 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౨(642) - Aditya Srirambhatla

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 10.2-1331-క. "నరవర! దేవాసుర సం గరమును మును నిహతులైన క్రవ్యాద సము త్కరము నరేశ్వరులై ద్వా పరమున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్. 10.2-1332-క. హరి తద్వధార్థమై ని ర్జరులను యదుకులము నందు జనియింపింపం ధర నూటొక్క కులం బై పరఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే? భావము: "ఓ నరేంద్రా! పూర్వం దేవదానవ సంగ్రామంలో మరణించిన రాక్షసులు అందరు ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధించసాగారు. విష్ణుమూర్తి ఆ రాక్షసులను చంపడం కోసం దేవతలను యదుకులంలో జన్మించేలా చేశాడు. అందువలన, యాదవుల యందు నూటొక్క కులాలు ఏర్పడ్డాయి. వారిని అందరిని లెక్కపెట్టడం బ్రహ్మదేవుడికి కూడ సాధ్యం కాదు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1332 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 29 Sep 2022 14:02:21 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger