గడ్డం గడ్డమా? గెడ్డమా? ఏది సాధువు? కొచ్చను. సాధువుకే గడ్డం ఉంటుంది, అసాధువుకి ఉండదన్నాడు మా సత్తిబాబు. ఏదైతేనేంగాని, గడ్డానికో చరిత్రే ఉండి ఉంది..గడ్డానికి చరిత్రేటి అడిగాడు మా సుబ్బరాజు. పెళ్ళిలో బెల్లమ్ముక్కటుక్జొచ్చి గెడ్డం కిందెట్టి బతిమాలేడు బామ్మర్ది, బెల్లం ముక్కలాటి నా చెల్లి/అప్పతో సంసారం చెయ్యవోయ్,సుకపడిపో, అని. దానికి పడిపోయి బెల్లమ్ముక్కలాటి వాడి చెల్లి/అప్పని కట్టుకుంటే, బెల్లం తిని తిని సుగర్ తెచ్చుకున్నట్టయింది. అక్కడితో అయిందా? కళ్ళుపోయాయి, కాళ్ళుపోయాయి. తింటే ఆయాసం తినకపోతే నీరసం,. ఇది జరుగుతున్నది. పోనీ బెల్లం ముక్క మిగిలిందా? లేదు తనుకరిగిపోయి వెళ్ళిపోయింది, తిరిగిరాని లోకాలికి,ఇంకేం మిగిలింది, మిగిలింది చింతేలే అని పాడుకోమంది. చెలియలేదు,చెలిమిలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేలే మిగిలింది నీవేలే అనుకోడానికేం లేదు. గతము తలచి వగచేకన్న సౌఖ్యమేలేదు అన్నాడో సినీ కవి. మరచిపోలేను అని వగచాడు మరో కవి. గడ్డం ఎక్కడికి తీసుకుపోయింది? గడ్డం పెంచడం ఇప్పుడు కొత్త ఫేషను. రాహుల్ గడ్డం అడవిలా పెరిగిపోయింది, బూచాడులా ఉన్నడన్నడో రాజకీయుడు, మరొకడు ఉండగా ఉండగా గాంధీ ఫేసు సద్దాంలా టుర్నింగ్ ఇచ్చుకుంటోందే అని జోకేడు. ఇది జోక్ కాదురా అని గోకేరు కొంతమంది. రాహుల్ కి మద్దతుగా గడ్డం పెంచడం మొదలెట్టా. మావాళ్ళంతా బలవంతం చేసి గీయించేసేరు, ఈ నిరవాకానికి గెడ్డమొకటా, అని.ఇంతోటి అందానికి వీసేబులం పసుపా అని నానుడి. అదేంటొ అందరూ మద్దతుగా నడుస్తున్నారు కాని గడ్డం ఒకడూ పెంచటంలేదు.ఇంతకీ మా రాహుల్ బాబు గడ్డం పెంచుతున్నాడుగాని ప్రధాని అవుతాడా, మిలియన్డాలర్ కొచ్చను. మాయలపకీరు ప్రాణం చిలకలో ఉంటే, మంత్రాలు గెడ్డంలో ఉన్నాయట. సాహసం శాయరా ఢింభకా! రాజకుమారి లభిస్తుందిరా! అని పదే పదే చెప్పిన పకీరుకి, సరసానికి గడ్డమెందుకు అడ్డం అనడంతో రాజకుమారి వరిస్తుందని గడ్డం గోక్కుంటే, చిలకలో ప్రాణం గుటుక్కు మనిపించాడు. మోడి గడ్డం పెంచితే, పెరిగిపోయిన గడ్డం మీద జోకులేసేరు.మొక్కేడేమో అన్నారు.ఇది కరోనా కాలం మాట. ముంబై నుంచి ఒక అంబష్టుడు ( మంగలి అనకూడదట)వందరూపాయలు మనీ ఆర్డర్ చేసేడు, గడ్డం ట్రిం చేయించుకోడానికి. అంటే గడ్డం ట్రిం చేయించుకునే ఖర్చు వందా అని నిర్ణయం చేస్సేడు. పాతకాలం గడ్డం పెచితే ఏం? మీ ఆవిడ కడుపుతో ఉందా? అడిగేవారు. లేకపోతే తిరపతి ఎంకన్నబాబు మొక్కా? అనేవారు.ఇప్పుడు పెళ్ళాం కడుపుతో ఉండడంతో గడ్డం పెంచుకునేవాళ్ళున్నారా?ఏమో! ఇంతకీ ఇది గడ్డమా? గెడ్డమా? ఏది సాధువో తెల్వదు.
Post Date: Fri, 16 Dec 2022 04:00:27 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 16 Dec 2022 04:00:27 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment