Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 22 December 2022

ఈసారొస్తే! ఇంతే సంగతులా? - sarma

ఈసారొస్తే! ఇంతే సంగతులా? ఒమిక్రాన్ ప్రపంచాన్ని వదిలేసినా చైనాని వదల్లేదు, పుట్టింటి ప్రేమకదా!ప్రజలు ఈ లాక్డవున్ జైలు జీవితంకంటే చావుమేలు వదిలెయ్యండని గోల చేస్తే వదిలేసింది చైనా, వారo, కితమే. వారంలో భరతదేశాని కొచ్చిందంటున్నారు.ఇది మోడీ చేతకాన్తనం అనలేదెవరూ ఇప్పటిదాకా! ఇకముందంటారేమో చూడాలి. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోండి, మళ్ళీ మాస్కులేసుకోండి, దూరంపాటించండి అంటోంది. కొంతమంది ఈ వేరియంట్ సోకితే లక్షణాలు కనపడవు, ఒక్కసారిగా న్యుమోనియా చుట్టుముడుతుంది అంటున్నారు.  చలికాలం, జాగర్త్తలు అవసరమే! ఈ సారొస్తే ఇంతే సంగతులా? అని అనుమానం. కాని ఆధార్ పూనావాలా అంటారూ, దేశంలో చలామందికి వేక్సీన్ ఇచ్చాముగనక భయం లేదంటున్నారు. చైనాలో మాత్రం కరోనా రోగులు పడుకోడానికి మంచాలు లేక కటికనేలమీద పడుకోబెడుతున్నారుట. ఇక శవాలు   వరస లోనే ఉంటున్నాయట, అంత్యక్రియలకి. ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా! ఏనాటి ఏతీరు ఎవరు చెప్పాగలరు, అనుభవింపక తప్పదన్నా!అనుభవించుట తథ్యమన్నా!! కొత్తవేరియంట్ కోనసీమకి చేరినట్టువార్త హరి సంకీర్తన మార్గశిరమాసం జొరబడి పదేనురోజులు కావస్తోంది, నెలపట్టి ఈరోజుకి ఎనిమిది రోజులు. ఈనెల హరి సంకీర్తనం ముఖ్యం. జనం చలికి జడిసి ఉదయం ఏడైనా తలుపులు తీసుకు బయటకే రావటం లేదు, ఈ హరిదాసులు ఇంకా పాతకాలపు సంప్రదాయం వదలలేక   హరిసంకీర్తన కి  బయలుదేరేరిలా! వందనం అభినందనం!!వందనం హరి కొరకై వందనం. వ్యత్యస్త పాదారవింద, ఇందిరాహృదయానంద! 1729   కత చెప్పిన రామానుజన్. ఈ రోజు శ్రీనివాస రామనుజన్ పుట్టిన రోజు. మహానుభావులు అరుదుగానే పుడతారు. గొప్ప లెక్కల్లోని లెక్కల మనిషి. మనం ఎవరిని బతికుండగా లెక్కచేయం.విదేశీయులు గుర్తిస్తే మనం మనవాడే అని కీర్తిస్తాం.  చచ్చిపోయాకా జన్మదినాలు చేస్తాం. మనం భారతీయులం కదా! ఇదింతే!! పాణిని సూత్రాలలో ఒక సూత్రాన్ని ఎవరూ వివరించలేకపోయారిప్పటిదాకా! మొన్న ఒక వారం కిందటే ఒక భారతీయుడే దానిని వివరించాడు. ఎవరు గుర్తించారు?మనం మారం!!!
Post Date: Thu, 22 Dec 2022 03:51:44 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger