Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 22 March 2023

పలుకుల పచ్చడి - గోలి హనుమచ్చాస్త్రి

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ "శోభకృత్" ఉగాది శుభాకాంక్షలు సీసము: పరుష వాక్యములను పరులను బాధించు తీరు వాక్కు లవియె కారమగును భావ్యమ్మునెరుగక సవ్యమ్ముగా లేని పొగరుమాటలు జూడ వగరు సాటి హద్దులెరుగకుండ నతిగమాట్లాడుట కొప్పుగాని పలుకు లుప్పు బోలు మోసంపు భావనల్ మూసిన పైపైని తేట వచనములే తీపి చాయ తేటగీతి: చేరి జెప్పెడు చాడీలు చేదు గాద పొల్లు స్వోత్కర్ష నుడువులు పులుపు భాతి కలిపి పచ్చడిగా వీని గడుపుజేర్చి మితము స్మిత బాషణముజేయు బ్రతుకుగాది. కందము: శోభకృతు నామ ధేయా! ప్రాభాత స్వాగతమిదె రా వత్సరమా! శోభాయమాన భవితను మాభాగ్యము పండ నీవె మాకీయగదే!
Post Date: Wed, 22 Mar 2023 00:35:56 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger