Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 15 November 2014

పిసినిగొట్టు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పిసినిగొట్టు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పిసినిగొట్టు

Posted: 14 Nov 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - పిసినిగొట్టు


ఆటవెలది:
కడుపుకింత తినక కబళ మొరుల కీక
మూట గట్టి దాచి మూల బెట్ట
' మూల ' ధనము బోవు ముద్దుగా నొరులకు
ముద్ద దొరక కితడు మూల బడును.
... పూర్తిటపా చదవండి...

నేనొక గులాబి రెమ్మని వంచేను… థామస్ బ్రౌన్, ఇంగ్లీషు కవి

Posted: 14 Nov 2014 11:46 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

వాసనచూద్దామని, నా వైపుకి

ఒక లేత గులాబి రెమ్మని వంచేను.

నేను అంతగా వంచినా,

బాగానే, విరిగిపోకుండా నిలదొక్కుకుంది.

కానీ,  దాన్ని వెనక్కి వదిలెయ్యగానే

ఆ నాజూకు కొమ్మ

ఎంత హేలగా, ఎంత తూగుతో

యథాస్థితికి వచ్చిందంటే…

చెప్పడం కష్టం.

నాకు అనిర్వచనీయ ఆనందాన్నిచ్చింది.

నాకు తెలుసు… మీకేమైనా సందేహమా?

వెనుతిరిగి చూస్తే…దానిగురించే గుసగుసలుపోడం విన్నాను.

.
థామస్ ఎడ్వర్డ్ బ్రౌన్

మే 5, 1830- 29 అక్టోబరు 1897

ఇంగ్లీషు కవి

.

పూర్తిటపా చదవండి...

చమత్కార పద్యాలు – 210

Posted: 14 Nov 2014 10:45 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

చాకిరేవు-09

Posted: 14 Nov 2014 10:31 AM PST

రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే.
"బాబాయ్, ఓ రెండు,మూడు ఫేమిలీలు కలిసి అలా ఏదైనా పిక్నిక్ వెళ్లొద్దాం. చాలా బోరు కొడుతోంది. ఎప్పుడూ అవే కాలేజీ గోడలు, అవే లెక్చరర్ ఫేసులు, అవే సినిమాలు... బోర్... చాలా బోర్..." అన్నాడు అబ్బాయ్ స్నానం చేసివస్తూ...
"మన ఇంటి సుట్టుపక్కల ఎవరైనా అమ్మాయిని గిల్లేవేట్రా... పిక్నిక్కులు గట్రా అంటన్నావ్" అన్నాడు... పూర్తిటపా చదవండి...

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73

Posted: 14 Nov 2014 09:24 AM PST

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ:

" సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగా... పూర్తిటపా చదవండి...

స్త్రీ స్వాతంత్ర్యము --

Posted: 14 Nov 2014 09:07 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

స్త్రీ స్వాతంత్ర్యము --

.

(సాక్షి వ్యాసాలు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు.)

.

పదాలు గుప్పించడంలోను, ఒకమాటకు పది మాటలు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger