Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 15 November 2014

వివాహ మైత్రి అష్ట కూటములు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

వివాహ మైత్రి అష్ట కూటములు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


వివాహ మైత్రి అష్ట కూటములు

Posted: 14 Nov 2014 10:49 PM PST

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
                 వధూ వరుల జన్మ లేదా నామ నక్షత్రాలను వివాహ అనుకూలత కోసం ప్రధానముగా భారతియ హిందూ జ్యోతిష సాంప్రధాయమునందు 1వర్ణ (కుల) పొంతన, 2వశ్య (ఆకర్షణ) పొంతన, 3తారాపొంతన, 4యోనిపొంతన, 5గ్రహా మైత్రి పొంతన , 6గణపొంతన, 7రాశిపొంతన, 8నాడిపొంతన అను ఎనిమిది రకాలైన పొంతనలను పరిశీలించి నిర్ణయము తీసికుందురు. ఇందు బ్రాహ్మణ కులస్తులు గ్రహమైత్రిని, క్షత్రియ కులస్తులు గణమైత్రిని, వైశ్య కులస్తులు రాశిమైత్రిని, ఇతర కులస్తులు యోని మైత్రిని తప్పక పాటించవలెను. నాడీ మైత్రిని సర్వకులస్తులు పాటించ వలెను. ఆపైన ఇరువురి జన్మ జాతక చక్రములలో దుష్టగ్రహ ప్రభావమ... పూర్తిటపా చదవండి...

ప్రాణికోటికి  ఈ భూమి మీద నివసించాలి అంటే  శ్వాస అన్నది ముఖ్యము.  శ్వాస అన్నది ఉచ్చ్వాస నిశ్వాసల తో కూడి...

Posted: 14 Nov 2014 10:01 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ప్రాణికోటికి  ఈ భూమి మీద నివసించాలి అంటే  శ్వాస అన్నది ముఖ్యము.  శ్వాస అన్నది ఉచ్చ్వాస నిశ్వాసల తో కూడి ఉన్న విషయము మన అందరికి తెలిసినదే.   మన చుట్టూ ఉన్న గాలి లో ప్రధానమైన వాయువులు  ఐదు, అవి వరుసగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, వాయవులు, ఉప వాయవులు  ఐదు, అవి వరుసగా  నాగ, కూర్మ,     క్రుకర,  దేవదత్త,  ధనంజయ  అని ఉప వాయువులు.    ఇవన్ని ఒక్కొక్కటి  ఒక్కొక్క పని చేస్తూ ఈ శరీరమును నడిపిస్తూ ఉంటాయి.  శరీరమంతకును  ముఖ్య ప్రాణము ఒక్కటే. అది  చేయు  పనిని బట్టి హృదయమందు ఉండి ఉచ్చ్వాస నిశ్వాస... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -24 తృతీయాశ్వాసం -9

Posted: 14 Nov 2014 09:37 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -24

తృతీయాశ్వాసం -9

అగస్త్య మహర్షి వ్యాసునికి భీమ ఖండ క్షేత్ర మహాత్మ్యం వివరిస్తూ –''కాల భైరవుని చేతిలోని బ్రహ్మ కపాల పాత్ర సప్త గోదావరీ తీర ప్రాంతం లోని భీమేశ్వరుని ప్రదేశం లో పడిన చోట కపాలేశ్వర స్వామి ఆవిర్భవించాడు .పూజిస్తే పాపనాశనమే .కపాల మోచన పుణ్య తీర్ధం లో చేసిన దానం ,హోమం ,యజ్ఞం అనేక రెట్ల ఫలదాయకం .ఇక్కడే పూర్వం వరుణుడు వరుణేశ్వర లింగాన్ని ప్రతిష్టించగా అయన భీమేశ్వరుని హస్తపద్మం అనే భరిణలోఉన్న గవ్వ లాగా పరాక్రమాన్ని చూపిస్తున్నాడు .ఇక్కడ సహస్ర ఘటాభిషేకం చేస్తే అనావృస్టి పోతుంది.పంటలు బాగా పండుతాయి .కోళ్ల గుంపులు మహా భక్తితో ప్రదక్షిణ చేసి మొక్షాన... పూర్తిటపా చదవండి...

పుష్పమంత మృదువు, ఖడ్గమంత పదును

Posted: 14 Nov 2014 07:54 PM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
ఒక కాలంలో, ఒక ప్రాంతంలో పాతుకొని ఉన్న వ్యవస్థ లక్షణం అక్కడ జీవిస్తున్న వ్యక్తి అంతర్గత ప్రవృత్తి మీదా, బాహ్య చలనాల మీద ప్రభావం చూపుతుంది. సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని […]... పూర్తిటపా చదవండి...

కపిల రాంకుమార్|| వెలుగు ఎపుడు ? || చాచా నెహ్రూ పుట్టినరోజంటే బాలల దినోత్సవమని అందరికీ ఎరుకే! ఆటలు, పాటలు,...

Posted: 14 Nov 2014 07:44 PM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్|| వెలుగు ఎపుడు ? ||
చాచా నెహ్రూ పుట్టినరోజంటే
బాలల దినోత్సవమని అందరికీ ఎరుకే!
ఆటలు, పాటలు, గురువుల్లా పాత్ర పోషణలు
బహుమతులు ఉపన్యాసాలు
రోటీన్‌గా రేడియో, దూరదర్శన్‌ అన్ని మీడియాల్లో
పోటాపోటీ వార్తలు
మార్మోగటానికెన్ని పాట్లో!
బడిలోని బాలల భవితకే
బడ్జట్‌లో నిధులు అరకొర కేటాయింపైతే
వీధిబాలల, బాల కార్మికుల గోడు పట్టించుకునేదెవరు!
వేళ్ళమీద లెక్కపెట్టగల స్వచ్చంద సంస్థలు తప్ప!
సర్కారు శాఖలో విద్యా విభాలెన్నెన్నో వున్నా
నిబద్ధత కరువైంది
ప్రతి సంవత్సరం
ఒక కొత్త ఆశ!
కాని నిరాశగానే మిగిలిపో... పూర్తిటపా చదవండి...

వంకాయ-టమాటా పచ్చడి

Posted: 14 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఈ పచ్చడి మలాతీచందూర్ గారి వంటలు-పిండివంటలు పుస్తకంలో చూసి చేశాను.ఈ పుస్తకం నాకు భలే ఇష్టం.నా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉండేది.తరువాత ఎవరికో ఇచ్చి మా అమ్మ దాన్ని పోగొట్టేసుకుంది.తరువాత చాలా యేళ్ళకి విశాలాధ్రలో కనపడితే కొన్నాను.వంటల కోసమే కాకుండా ఈ పుస్తకాన్ని ఊరికే చదవడం నాకు చాలా ఇష్టం.ఈ పచ్చడి అందులో నుండే … Continue reading ... పూర్తిటపా చదవండి...

1816 నాటి తెలుగు సమాజం - రంగుల చిత్రాలలో

Posted: 14 Nov 2014 07:04 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
రవివర్మ కు ముందు హిందూ దేవతల చిత్రాలు ఎలా ఉండేవో అంటూ ఎక్కడో చర్చ జరిగింది. 1816 లో M.Leger, Jean Amable అనే ఫ్రెంచి దేశస్థులు వేసిన కొన్ని చిత్రాల లింకు ఇది. ఇందులో మహిషాసురమర్ధిని, భక్తకన్నప్ప, వివిధ కులవృత్తులు, సారాతయారీ, పైపుతాగుతూ రాట్నం వడికే స్త్రీ, కసరత్తులు చేస్తున్న స్త్రీ, పురుషులు వంటి చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి తెలుగునాట చిత్రించబడటం మరో విశేషం. ఒకరక... పూర్తిటపా చదవండి...

చాట్

Posted: 14 Nov 2014 06:52 PM PST

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~

జీవనం
నిత్య నడక, పరుగులు
ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి
ప్రాధాన్యత ఆసక్తిని తొక్కిపడుతుంది
ఒక్కోసారి మరుగైపోతుంది

**

ఏది కవిత్వం
ఏది జీవితం
ఏది ప్రాధాన్యత

**

ఒక సంభాషణ
నాతో నేను
నీతో నేను
అందరితో నేను

**

పని ప్రతిఫలానిస్తుంది
సంభాషణేమిస్తుంది
ఎప్పుడైనా ఒక్కసారి సంభాషించి చూడు
నడకలో ఎక్కడొకచోట ఊతమిస్తుంది

కన్రెప్పమూసి
కళ్ళలోనే ఆలింగనంచేసుకో
ఏదీ ఎక్కడికీ పారిపోదు సుమా!

----

Radhi Radhika తో మాట్లాడాక 14.11.2014
... పూర్తిటపా చదవండి...

అవధాన రాజధాని కార్యక్రమంలో నేను దత్తపది పృచ్ఛకునిగా వ్యవహరించిన తీరు.

Posted: 14 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! సభా కల్పతరుం వందే అని నేను సభాముఖంగా సమర్పించిన పద్యాలు చూడండి.
శ్రీ

రుక్మిణీకల్యాణం – అయ్యా! కొడుకు విచారము

Posted: 14 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger