Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 18 March 2015

హారము కొరకై యొక సతి హారము నమ్మెన్ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

హారము కొరకై యొక సతి హారము నమ్మెన్ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

Posted: 17 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 



సమస్య - హారము కొరకై యొక సతి హారము నమ్మెన్


కందము:
భారపు బ్రతుకున పొలమున
పైరునకే బట్టె చీడ, భర్యె మందుల్
చేరుచుగొన పురుగుల సం
హారము కొరకై యొక సతి హారము నమ్మెన్
... పూర్తిటపా చదవండి...

నీ కోసం నేను వదులుకున్నవి… రఫేల్ ఆల్బెర్టి, స్పానిష్ కవి

Posted: 17 Mar 2015 02:25 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నీ కోసం నా తోటా, నా ఉద్యానమూ,
నిద్రపోక ఎదురు చూసే పెంపుడు కుక్కలూ,
నా జీవితాన్ని ముందే హేమంతంలోకి నెట్టిన
నా వసంతంలాంటి వయసూ…

ఒక భయాన్నీ, ఒక అదురుపాటునీ,
ఆరని మంటలాంటి ప్రతిభనీ,
నిస్సహాయంగా వీడ్కోలుపలికే రక్తపుజీరల
కన్నులలో నా ప్రతిబింబాన్నీ వదిలిపెట్టేను.

నది ఒడ్డున విషణ్ణలైన పావురాయిల్నీ,
మైదానంలో గుర్రాలనీ, నిన్ను చూడడానికి
కమ్మని సముద్రపు సుగంధాన్ని వదిలిపెట్టేను.

నీ కోసం నాదనుకున్న ప్రతీదీ విడిచిపెట్టేను.
ఓ రోము మహానగరమా!  నా బాధలకీ, నిన్నుపొందడానికి
వదులుకున్నవన్నిటికీ, … తగినప్రతిఫలాన్ని  ప్రసాదించ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 852

Posted: 17 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
unnamed.jpg

పూర్తిటపా చదవండి...

సియాటిల్ అందాలు

Posted: 17 Mar 2015 10:28 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ప్రియమైన పాఠకులారా! యిన్ని అందాలతో పొందికగా వున్న యా సియాటిల్ పట్టణం మాకు యిష్టం. మాపిల్లలు అంటే….. మాఅబ్బాయి, కోడలూ, మనవరాలు నివసిస్తున్న యీపట్టణం అంటే మాకు మరీ యిష్టం. అవకాశం కుదిరినప్పుడల్లా యిక్కడికి రావడం మాకు మరీమరీ యిష్టం. Here is a small write-up on this beautiful City.  సియాటిల్ అందాలు


పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 17 Mar 2015 09:39 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

జగముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
దగ నురమందు దాల్చె ; నట దత్కరుణా రస దృష్టిచే బ్రజల్
మగుడగ దొంటి భంగి నతిమంగళ సాధ్వి పతిత్వ సంపదన్
నెగదిన లోకముల్ గని; రనేక శుభంబుల బొంది రత్తఱిన్

తండ్రి నారాయణుని వక్షస్థలం చేరిన మాత  ప్రజలను చల్లని చూపు చూసింది . ఆ తల్లి చల్లని చూపులు పడిన జనులు ఎన్నో శుభాలు పొందారు .

ఆనందంతో బ్రహ్మాది దేవతలు పుష్ప వర్షం కురిపించారు .లక్ష్మిని ధరించిన విష్ణుమూర్తిని మంత్రాలతో స్తోత్రం చేసారు .... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger