Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 13 May 2016

ఎగిరొచ్చి... ... మరో 2 వెన్నెల వెలుగులు

ఎగిరొచ్చి... ... మరో 2 వెన్నెల వెలుగులు


ఎగిరొచ్చి...

Posted: 13 May 2016 08:29 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఎక్కడి నుంచో ఎగిరొచ్చి వాలిందో బంగారు పిచ్చిక
బిత్తర చూపులతో -

పాపం, ఎందుకొచ్చిందో ఎవరికి తెలుసు? గూడు
కట్టుకుందామనుకుందో, గింజలు
ఏరుకుందామనుకుందో, మరి

మట్టి ముంతలోని నీళ్ళ కోసమో, పుల్లల కోసమో
నీ కోసమో, ఎందుకొచ్చిందో లోపలికి
తత్తరుపాటుతో, కిచకిచమంటో

ఎక్కడి నుంచో ఎగిరొచ్చి వాలింది, వాలు చూపుల
బంగారు పిచ్చిక -

వాలి, ఎంతో భద్రంగా ఆకుల మాటున దాచుకున్న
నీ హృదయాన్ని నోట కరుచుకుని

కిలకిలా నవ్వుతూ వెళ్ళిపోయింది, అల్లరి కనుల
తుంటరి రాకాసి పిల్ల !
... పూర్తిటపా చదవండి...

క్రోమ్ మరియు ఫైరుఫాక్సు బ్రౌజరులను అప్డేట్ చెయ్యటం ఎలా తెలుసుకోవాలంటే!!! చూడండి వీడియో

Posted: 13 May 2016 05:16 AM PDT

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news


పై వీడియోని నేరుగా youtube లో చూడాలి అనుకుంటే https://goo.gl/1bzAr6 లింక్ క్లిక్ చేసి కూడా చూడవచ్చు .
ఇక వీడియోని చుసిన మీకు కృతజ్ఞతలు .వీడియో నచ్చినట్లు ఐతే ఇతరలకు షేర్ చెయ్యగలరు .
మా facebook page ని like చెయ్యటం ద్వారా మరింత సమాచారం పొందవచ్చు .
పూర్తిటపా చదవండి...

కలువభామ

Posted: 13 May 2016 04:39 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఒడ్డున కూర్చుని
కొలనులోకి చూస్తుంది .... ఆమె
కన్నీటి కొలనులయ్యాయి
ఆమె కళ్ళు

ఎన్నాళ్ళి లా
ఈ ఎదురుచూపుల
ఈ నరకయాతనల
ఆవేదన అని

అప్పుడే
అటుగా వెళుతూ ఉన్న
పిల్లగాలి అల ఒకటి ఆగి
ఆమె భుజాన్ని తట్టింది.

చిరు ఓదార్పు విసురు
స్పర్శతో ....
అతని స్పర్శలా
గోరు వెచ్చదనాన్నిస్తూ

ఔనూ ఎందుకిలా?
ఎందుకు
ఈ ఏకపక్ష మనోభావన
ఈ ప్రేమ

అనాసక్తతను
ఆసక్తి గా
తియ్యని బాధను
తీరని అనుబంధం గా మారుస్తూ 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger