Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 12 May 2016

జీవితం… బ్రయన్ వాలర్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

జీవితం… బ్రయన్ వాలర్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


జీవితం… బ్రయన్ వాలర్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవి

Posted: 11 May 2016 02:25 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనం పుడతాము, నవ్వుతాము, ఏడుస్తాము,
మనం ప్రేమిస్తాము, కుంగిపోతాం, నశిస్తాం!
ఆహ్! ఇక ఎందుకూ మనం నవ్వడం ఏడవడం?
మనం ఎందుకు పుడతాం ఎందుకు గిడతాం?
నిగూఢమైన ఈ రహస్యానికి సమాధానం ఎవరికి తెలుసు?  
అరే! నాకయితే మాత్రం తెలీదు!

మనిషి కంటికి కనబడకుండా
పువ్వులెందుకు వికసిస్తాయి?
పూర్తిటపా చదవండి...

ఖండకావ్యము - 22

Posted: 11 May 2016 11:33 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
శివశివా!
lord-shiva-legends.jpg
పూర్తిటపా చదవండి...

అష్టమహిషీకల్యాణము - 14

Posted: 11 May 2016 10:36 AM PDT

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
చతుర్థాశ్వాసము
(శ్రీదేవీ మహిమ వర్ణన)
(ద్విపద)

భూమిసపత్ని యంబోరుహాక్షు పత్ని
కాముని తల్లి చక్కని కల్పవల్లి
కలకంఠవాణి సకతనిభశ్రోణి
యలఘు గుణోత్తుంగ యలమేలుమంగ
యవధరింపుము దేవి యమ్మహామౌని
కువలయేశుఁడు వల్కె గువలయేశ్వరుని
వసుదేవ దేవకల్ వసుదేవముఖ్యు
లసమానగతిఁ బొల్చు నాత్మజాతులకు          (4480)
రామ కృష్ణుల... పూర్తిటపా చదవండి...

సీతాకోక చిలక, तितली

Posted: 11 May 2016 10:15 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత

బటర్ ఫ్లై! బటర్ ఫ్లై! 
నీ రెక్కలపైన విరజిమ్మెను రంగులెన్నొ ; 
ఆ నీలి ఆకాశం;
నీ రెక్కల పైన ఆరబోసినది వన్నెలెన్నొ ; 
ఈ విశాల వసుంధర! 
;
లోకాన పూజలెన్నొ జరుగుతున్నవి ; 
పూర్తిటపా చదవండి...

ఎం.నారాయణ శర్మ గారి 'ఈనాటి కవిత': మరువం ఉష-శీతగానం

Posted: 11 May 2016 10:09 AM PDT

రచన : మరువం ఉష | బ్లాగు : మరువం
కవిత్వం కావాలి కవిత్వం అనుకుంటుంటాం..కాని కవిత్వమంటే..అనే ప్రశ్న చాలా సార్లు..వస్తుంది..ఒక్కో మార్గంలో ఒక్కో రకంగా నిర్వచించు కుంటారు.ఇవన్నీ సరైనవని ఎలా చెప్పలేమో సరికాదనివాదించడానికీ అంతే అవకాశంలేదు.

కవిత్వం కళాతాత్వికభావనలు కనిపించి ఒకసాధారణ దృశ్యాన్ని ప్రతిమగా మహొన్నతంగా అందించాలని కళాతాత్వికులభిప్రాయపడతారు.దృశ్యాన్ని ఆమూర్తంగా కళావ్యాఖ్యానాలు నిలబెడతాయి.ఇందుకు ప్రతీకలు,భావచిత్రాలు ఎక్కువ ఉపయోగపడతాయి.
భావచిత్రం అంటే కనిపించే... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment