>> 09 December 2011<<
మన దేశం అనేక భాషలకు, కళలకు,విభిన్న సంస్క్రుతులకు పుట్టినిల్లు..భాషా పరంగా మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు.కానీ బ్లాగర్ల విషయంలో మాత్రం మనము చాలా వెనుకబడి ఉన్నమనే విషయం తెలుసా..? అయినా చెప్పక తప్పదు.
ఇప్పటికీ ఇంగ్లీషులోనే బ్లాగింగ్ చేసే వారిని మినహాయిస్తే హిందీలో అత్యదిక బ్లాగర్లు ఉన్నారు. ఇక హిందీ తర్వాత తమిళ్,గుజరాతీ,మలయాళం బ్లాగర్లు ఎక్కువగా ఉన్నారు.అంతేకాదు ఆయా భాషల్లో ఉత్సాహంగా పోస్టులు చేసే బ్లాగర్ల సంఖ్య కూడా చాలాఎక్కువే! అయాభాషల సగటు బ్లాగ్ పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ...
తెలుగులో ఈ మాత్రమైన బ్లాగర్ల సంఖ్య పెరిగిందంటే ముఖ్య కారణం జల్లెడ, కూడలి, మాలిక, హారం,సంకలిని వంటి బ్లాగు సంకలినులే అని చెప్పక తప్పదు.
మీరు ఒక సారి తమిళ్ బ్లాగ్ ఆగ్రిగేటరులైన http://www.valaipookkal.com/, http://www.tamilmanam.net/, http://www.ulavu.com/,http://www.udanz.com/ లు గానీ
మలయాళీ ఆగ్రిగేటరులైన http://chintha.com/malayalam/blogroll.php, www.cyberjalakam.com/aggr/ లు గానీ
గుజరాతీ ఆగ్రిగేటరైన http://www.neepra.com/ గానీ చూసారా ?
వాటిలో వ్యత్యాసాలు చూసారా? వాటి డిజైన్ , వోటింగ్ సిస్టం , ఫీచర్లు మన తెలుగు ఆగ్రిగేటరులలో ఉన్నాయా ?
ఒకసారి మన జల్లెడ నుంచి సంకలిని వరకూ చూడండి ..
అన్నీ ఒకే మూసలో ( జల్లెడ తప్పించి) " బ్లాగు పేరు: టైటిల్ " చూపిస్తాయి... నన్ను క్షమించండి
మరోసారి నన్ను క్షమించండి .. నిజమా? కాదా ?
మరేమికావాలి అని నన్ను అడుగుతున్నారా ?
నేను చెపుతాను ఒక్క రెండు రోజుల్లో ..!!!
ఈలోగా మీరు చెప్పండి మీకేమి కావాలో...
ఇదేమిటి పోస్టును మద్యలో వదిలేసి మీరు చెప్పండి అంటాడేమిటి అనుకోకండి ప్లీజ్
ఈ పోస్టును కంటిన్యూ చేస్తాను కానీ ఇప్పుడైతే మీరు చెప్పండి మీకేమి కావాలో !!
మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ...
( డిసెంబర్ 11 తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగిల్లు వ్రాస్తున్న వ్యాసం )
No comments :
Post a Comment