Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 26 December 2014

మిస్ యూ ఎలాట్ ... మరో 8 వెన్నెల వెలుగులు

మిస్ యూ ఎలాట్ ... మరో 8 వెన్నెల వెలుగులు


మిస్ యూ ఎలాట్

Posted: 26 Dec 2014 04:46 AM PST

రచన : | బ్లాగు : జాజిమల్లి
ఈ తరం పాఠకుల కోసం ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఒక మంచి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. చాసో ,కొకు, పి. సత్యవతి, కేతు విశ్వనాథ రెడ్డి, ఓల్గా వంటి పది మంది ఉత్తమ రచయితల కథల్లో పదింటిని ఎంపిక చేసి కథా స్రవంతి పేరున విడి విడి సంపుటాలుగా ప్రచురించింది. పది పుస్తకాలకీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు గౌరవ సంపాదకులుగా వల్లూరు శివప్రసాద్ గారు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఒక్కో పుస్తకానికి సంపాదకత్వ […]... పూర్తిటపా చదవండి...

ప్రశాంతత

Posted: 26 Dec 2014 04:02 AM PST

రచన : | బ్లాగు : సాహితీ-యానం

కనుల లోతుల్లోకి

పూవురాలేను

Posted: 26 Dec 2014 01:59 AM PST

రచన : | బ్లాగు : బివివి ప్రసాద్
పగటి కాంతిరేకలు చీకటుల సోలినటు
మధురస్వప్నమొకటి మెలకువన జారినటు
ఆమె వెన్నెలనవ్వు నీలోకి వాలినటు
పూవురాలేను పూవువలె నెమ్మదిని

గాలివాలువెంట ఒంపు తిరిగి
గాలినొక పూవుగా హొయలు దీర్చి
రంగురంగుల గిరికీలు చుట్టి
కాంతినొక పూవుగా చిత్రించి విడచి

నేలపై మృదువుగా మేనువాల్చి
నేల నొకపూవు రేకులా మలచి
పూవొకటి రాలేను ఇచట ఈ స్థలములో
తననీడపై తాను సీతాకోకయ్యి వాలేను

సెలయేటి పరుగులా, పసిపాప నవ్వులా
చిరుగాలి తరగలా, పరిమళపు తెరలా
పూవొకటి రాలేను ఈ క్షణములోన
పూవంటి క్షణమొకటి రాలేను స్వప్నమ్ములోన

_________... పూర్తిటపా చదవండి...

ఘర్ వాపసి నేపథ్యంలో: హిందూ వ్యతిరేకతే నిజమైన సేక్యులరిజమా ? - శ్రీ రామానుజన్

Posted: 26 Dec 2014 01:56 AM PST

రచన : | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
ప్రస్తుతం దేశం ''హిందూ వ్యతిరేకతే సెక్యులరిజం'' అనే రాజకీయ అప్రమాణిక భాషతో నిండిపోయివుంది. మిషనరీల దృష్టిలో భారత్ అంటే విగ్రహారాధకులు, క్రీస్తు విశ్వాసులు కానివారితో నిండిన చీకటి భూమి. దీన్ని వెంటనే క్రీస్తు భూమిగా మార్చాలి. భారత్ నిరుపేద దేశంగా ఎందుకున్నదంటే...ఇక్కడంతా విశ్వాసులు కానివారు ఉండటం వల్ల. 'జోషువా ప్రాజెక్టు' ప్రధాన లక్ష్యం ఈ అన్యమతస్థులను 'హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్'కు గురి చేయడమే
భారత్‌కు ఏది కొత్త? మతమార... పూర్తిటపా చదవండి...

శ్రీ సువర్చ లాంజనేయం -5

Posted: 26 Dec 2014 01:26 AM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చ లాంజనేయం -5

51-పితరౌ !గీతం లిఖితం వామే –తచ్చ్రేయసే భవిష్యతి వామే

తద్విజయాయ భవిష్యతి వామే –తదభీప్సితం ఫలిష్యతి వామే .

తా-తల్లీ!పితా !నాసొసట సంగీతం రాయలేదా మీరు ?నా శ్రేయస్సు ,విజయం అపెక్షించి అలా  రాయకుండా వదిలేశారా?నాకు ఆజ్ఞానం పొందే అదృష్టం లేదా?

52-మాతర్మహ్యమ్ భాషా –మదాః సంగీతం నాదాఃకో  హేతుః

నార్హో వాహం గాతుం –కరుణాద్యాపి మయిస్తినా .

తా-తల్లీ !చక్కని భాషనిచ్చావు .సంగీతానికి నేను తగనా?ఇప్పటికీ నా మీద నీకు దయ రాలేదా?

53-ఏవం సంప్రుచ్చ మాన –వాగ్బ్రహ్మాణౌతౌ –ద్వాపర యుగే

శ్రీ కృష్ణా త్సంగీతమ్-సంప్రాప్స్య –సీతిసమూచాతే.

తా... పూర్తిటపా చదవండి...

'మాతృషోడశి'.!

Posted: 26 Dec 2014 01:22 AM PST

రచన : | బ్లాగు : పలుకు తేనియలు

'మాతృషోడశి'.!

'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను

..

ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి,

.

ఆరోగ్యం గు... పూర్తిటపా చదవండి...

అమవస నిసి

Posted: 26 Dec 2014 01:22 AM PST

రచన : | బ్లాగు : పలుకు తేనియలు

అమవస నిసి

- 'పద్య కళాప్రవీణ' డా.ఆచార్య ఫణీంద్ర

'ఆకలి రాజ్యమ్ము' నందు నిరుద్యోగ

యువత కందించె దివ్యోపదేశ -

మభిమానవతులైన అతివ... పూర్తిటపా చదవండి...

కినిగె పత్రికలో “దొ దివానె షెహర్ మెఁ…”

Posted: 26 Dec 2014 12:34 AM PST

రచన : | బ్లాగు : ఊహలన్నీ ఊసులై..

దొ దివానె షెహర్ మెఁ…

వీడియో కాల్ కనెక్ట్ అవ్వగానే అతడి గొంతు కన్నా ముందుగా ఆ పాటే వినిపించింది ఆమెకు. అతడు స్క్రీన్‍పై కనిపించడానికి ఓ రెండు నిముషాలు పట్టింది. మొహంపై తడి లేకుండా తుడుచుకొని, టవల్‍ను పక్కనే పడేసి, లాప్‍టాప్‍ను ఇంకా దగ్గర తీసుకొని, మీడియా ప్లేయర్‍లో పాటను ఆపి, ఆమె ఉన్న విండోని మాక్సిమైజ్ చేశాడు.

"హే బేబీ! వాట్స్ అప్?"

"ఏంటి? ఇప్పుడే షేవ్ చేసుకొని వచ్చావా?"

అతడింకా గెడ్డంపై నురగగానీ ఉండిపోయిందా అని చెంపలను సర్వే చేస్తుండగానే —

"నిజం చెప్పు రాజ్.. బానే ఉన్నావా?"

వారం పది రోజులుగా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ, మెదడూ ఒళ్ళూ హూనమైపోయి,... పూర్తిటపా చదవండి...

ఈమాటలో “ఏనాడూ విడిపోని ముడి వేసెనె”

Posted: 26 Dec 2014 12:33 AM PST

రచన : | బ్లాగు : ఊహలన్నీ ఊసులై..

One of those nights!

మంచం ఒకటే అయినా నీ-నా పక్కలంటూ సరిహద్దులు పుట్టుకొచ్చే రాత్రి. ఇరువైపులా సైన్యాన్ని మోహరించి, కాల్పులకు సిద్ధంగా ఉండే రాత్రి కాదు. కయ్యానికి కాళ్ళుదువ్వననీ, సరిహద్దులను గౌరవిస్తాననీ కుదురుకున్న సంధిని ఉల్లంఘించలేని రాత్రి. తాను సత్య అయినా అతడు సముద్రాలు దాటి, యుద్ధాలు ముగించి వచ్చేవరకూ సీతలా వేచిచూడాల్సిన రాత్రి.

అతడు మంచానికి అటు చివర పడుకునున్నాడు, నల్లరగ్గు ముసుగులో. ఇంకా నిద్రపోయినట్టు లేడు. ఎలా పోతాడు? నిద్ర పట్టేంత సుఖమే అతనికుంటే, ఆ నల్లరగ్గెందుకు ఉంటుంది? ఆమె చడీచప్పుడూ లేకుండా మంచానికి ఇటు చివర పడుకుంది. అంత అలసటలోనూ ఇది ఇక నిద్రరాని రాత్రని తెలుస్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger