Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 9 February 2015

హిందూ ధర్మం - 143 ... మరో 6 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 143 ... మరో 6 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 143

Posted: 09 Feb 2015 07:28 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన ఆధారాలు. ఈ శాసనాలను కుట్రపూరితంగా ఆంగ్లేయులు త్రొక్కివేశారు. కొన్నిటిని నాశనం చేశారు. వాటికి రకరకాల అబద్ధాలను అంటగట్టారు, అయినా సత్యాన్ని ఎవడు దాచలేడు. అనేక మంది పరిశోధకులు ఈ రాగిశాసనాలను పరిశీలించారు. మొదటి శాసనంలో చెప్పబడిన గ్రామాలు ఇప్పటికి ఉన్నాయి.

ఈ శాసనాలు, పురావస్తు ఆధారాలు మహాభారతం చరిత్రలో జరిగిన యధార్ధం అని మళ్ళీమళ్ళీ ఋజువు చేస్తున్నాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి కాలాన్ని కూడా లెక్కవేశారు. ఇవిగాక మహాభారతంలో చెప్పబడ్డ గ్రహగ... పూర్తిటపా చదవండి...

ఈ శీతాకాలపు ఉదయం

Posted: 09 Feb 2015 05:09 AM PST

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
           ఈ శీతాకాలపు ఉదయం. రాత్రంతా మంచుముక్కలా బిగుసుకొన్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండితెరల కాంతిలోంచి జారుకొంటూ గడ్డిపరకలపై కన్నుతెరిచాయి. ఇక చాలనుకొంటూ కాంతిబాజా మ్రోగిస్తూ కనిపించనిచోటికి నిన్ను పిలుస్తూ మాయమయ్యాయి. ఈ ఉదయం తొడుక్కొన్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్తసంతకాలు చేస్తున్నాయి. మనుషులు సరే. ఎప్పట్లానే ప్రాణాన్ని పట్టుకోమంటే దేహాన్ని తాకుతూ, ఇంత బంగారుకాంతికీ రవంతైనా కరగని ఇనుపస్పందనలతో, మోసపోయామని తుప్పు... పూర్తిటపా చదవండి...

'అపరిచితుడు' -ఆల్బర్ట్ కామూ

Posted: 09 Feb 2015 04:49 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఆల్బర్ట్ కామూ పేరు చాలా రోజులుగా పరిచయం. తరాలతో నిమిత్తం లేకుండా చాలామంది తెలుగు రచయితల అభిమాన రచయిత కామూ. తెలుగు రచయితల మాటల్లో కామూని గురించి చదివానే తప్ప, ఆయన రచనల్ని నేరుగా చదివింది లేదు. ఈ నేపధ్యంలో, పీకాక్ క్లాసిక్స్ ప్రచురించిన 'అపరిచితుడు' నవల నా కంటపడింది. The Outsider/The Stranger పేర్లతో కామూ రాసిన చిన్న నవలకి జి. లక్ష్మి చేసిన నూటరెండు పేజీల తెలుగు అనువాదం. తేలికగా కనిపించే బరువైన పుస్తకమిది.

ఇది అంతర్ముఖుడైన మెర్ సాల్ట్ కథ. అతని జీవితం ఊహించని మలుపులు తిరిగిన క్రమంలో, మెర్ సాల్ట్ మానసిక స్థితులని నిశ... పూర్తిటపా చదవండి...

గంధా హై పర్ దందా హై యే

Posted: 09 Feb 2015 04:40 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
తెరవని తలుపులు నీవి.

అందుకనే ఎవ్వరూ రారు నీ వద్దకు. "అవసరం కోసం కాకుండా ఇద్దరు కలవచ్చు. కొంతసేపు మాట్లాడుకోవచ్చు. ఊరకే, రికామీగా, అట్లాగా... " అని నువ్వు నమ్మావు కానీ, లోకం అట్లా లేదనీ, నువ్వు అనుకున్న వాళ్ళెవ్వరూ అలా లేరనీ  తెలసి వస్తుంది. వాళ్ళ అవసరాలకే నువ్వు అనీ, నీ కోసం ఎవ్వరూ ఎదురు చూడరనీ, నువ్వు ఎప్పట్లాగే నీ గోడలతో, నీడలతో, నీడల్లో కనిపించే కథలతో బ్రతకాల్సి వస్తుందనీ అర్థం అవుతుంది. ఏం లేదు. కాలిక్యులటేడ్ ప్రపంచం. హెచ్చువేతలూ, కూడికలూ. నువ్వు నీ కవితల్లో వాంతి చేసుకున్నట్లు, మరికొందరు తమ భయాలనీ... పూర్తిటపా చదవండి...

ఏక శ్లోక రామాయణమ్

Posted: 09 Feb 2015 03:32 AM PST

రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం
ఆదౌ దశరధరాజగర్భ జననం,మౌంజీబంధన,వేదశాస్త్ర పఠనమ్
విద్యా సంగ్రహణం,సుబాహు మరణం,స్త్రీ శాప  నిర్మోచనమ్
శంభోః కార్ముకభంజనం,జనకజా కల్యాణ సంధాయనమ్
మాతాపితృ శ్శోభణం,మార్గే భార్గవరామ గర్వ హరణమ్
కైకేయి కృత దండకాది గమనం, హత్వా మృగం కాంచనమ్
వైదేహీ హరణం,జటాయు మరణం,సుగ్రీవ సంభాషణమ్
వాలేర్నిగ్రహణం,స... పూర్తిటపా చదవండి...

నీడలు పరుచుకుంటూ

Posted: 09 Feb 2015 03:09 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నీ ఒట్టులు, నీ వాగ్... పూర్తిటపా చదవండి...

దేవతామూర్తులను పారవేయకండి

Posted: 09 Feb 2015 01:36 AM PST

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
హిందూ సమాజం భగవంతుని యొక్క నిరాకారాన్ని  పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger