Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 19 March 2015

దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దేశ భాషలందు తెలుగు లెస్స.

Posted: 18 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - దేశ భాషలందు తెలుగు లెస్స. 


ఆటవెలది:
అందచందమొల్కు నక్షరమ్మున లెస్స
పలుక నోట తేనె లొలుకు లెస్స
పద్యమందు బాడ వాక్శుద్ధి యగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స.
... పూర్తిటపా చదవండి...

తొలిసంజ… షెల్లీ, ఇంగ్లీషు కవి

Posted: 18 Mar 2015 02:37 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

తొలిసంజ మేల్కొలపగలిగిన అన్నిటినీ మేల్కొలిపింది
స్వేచ్ఛగా తిరిగే పిచుకల్నీ, పిట్టల్నీ, కోయిలలనీ,
గొల్ల వనిత పాటల్నీ, తోటమాలి దోకుడుకత్తి చప్పుడునీ,
ప్రభాత ప్రార్థన ఘంటనీ, గండు తుమ్మెదలనీ:

మంచోడుతున్న మొక్కజోన్నకంకులపై మిణుగురులు సేదదీరుతున్నై,
విద్యార్థి సరిచెయ్యడం మరచిన లాంతరు వత్తుల్లా,
నదీ తీరాన్న అవి కొడిగడుతున్నాయి.

కందిరీగ తన ఝంకారం మరిచిపోయింది
కొండమీదా, మైదానం మీదా కీచురాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాయి,
రైతు తుపాకికి చప్పుడుకి దౌడుతీస్తున్న ఏనుగుల మందలా
రాత్రి భయాలూ, పీడకలలూ, ప్రతి ఒక్కటీ
తొలికిరణానికి కొండెక్కిన దీపంతో... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 853

Posted: 18 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
images%2B(1).jpg

పూర్తిటపా చదవండి...

కాసేపు…

Posted: 18 Mar 2015 10:44 AM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
  కాసేపు నా గురించి నేనేమైనా రాసుకొంటానే!   ఓడిపోయినా నా ప్రేమతో కొద్ది సేపు కాగితం తడుపుకొన్నాను ఉగ్గ పట్టిన బెంగతో మగ్గిపోయి నీరు కారుతున్న …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger