Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 24 July 2021

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)  ఎందుకలా అని అడగద్దెవరూ!-కర్లపాలెం హనుమంతారావు- ఎద్నా సైంట్ విన్ సెంట్ మిలే ఆంగ్ల కవితకు నా తెలుగు సేత   పిల్లల్లారా వినండర్రా మీ నాయన పోయాడివాళ ఆయన పాత కోట్ల నుంచి మీకు  బుల్లి బట్టలు కుట్టించేదా నాయన పాత పేంట్లు చించి మీ సైజుకు సరిపోయే  దుస్తులు కుట్టిస్తానర్రా తాళాలూ చిల్లర డబ్బులు పొగాకు చుట్టల అడుగున ఆ జేబుల్లోనే కదా పడివుండేదీ! డుంబూకేమో తండ్రి పైసలు బ్యాంకుల్లో వేసుకు దాచుకునేందుకు బుజ్జి తల్లికి తాళాల గుత్తులు కాళ్ల గజ్జెల్లా ఆడించుకు తిరగడానికి .. ఎన్ని చావులొచ్చినా బతికుండక తప్పదురా పిల్లల్లారా పోయినోళ్లు ఎంతటి మంచోళ్లయినా ఎల్లకాలం గుర్తుంటారా ఎక్కడైనా బుజ్జీ, బడికెళ్లే టైమయింది లే, ఫలహారం చెయ్ డుంబూ  నీ కాలికి నొప్పన్నావుగా పోయి ముందు గాయానికి మందేయ్ జీవితంతో  అదే గొడవరా భడవాయిల్లారా ఎంత నొచ్చినా తప్పించుకు తిరక్క తప్పదురా కూనల్లారా ఎందుకలా అని అడగద్దెవరూ ఎందుకనో..   నాకూ గుర్తుకు రాడం లేదు మరి ఇ ప్పటికిప్పుడు ! -( ఎద్నా సైంట్ విన్సెంట్ మిలే కవిత – లేమెంట్ కు నా తెలుగు సేత) - కర్లపాలెం హనుమంతరావు 24 -07 -2021 Lament Listen, children: Your father is dead. From his old coats I’ll make you little jackets; I’ll make you little trousers From his old pants. There’ll be in his pockets Things he used to put there, Keys and pennies Covered with tobacco; Dan shall have the pennies To save in his bank; Anne shall have the keys To make a pretty noise with. Life must go on, And the dead be forgotten; Life must go on, Though good men die; Anne, eat your breakfast; Dan, take your medicine; Life must go on; I forget just why. -Edna St. Vincent Millayనా పరామర్శఃఇంటికి పెద్ద దిక్కు అనూహ్యంగా మరణిస్తాడు. అప్పటి వరకు ఎంతో బేలగా కనిపించిన ఆ ఇంటి ఇల్లాలు  ధీరగా మారుతుంది. ముందు ముందు ఎదిగి జీవితంలో తమ తమ  సొంత కాళ్లపై నిలబడవలసిన తన పసికూనల కోసం పుట్టెడంత దుఃఖాన్ని కడుపుల్నే అణుచుకుంటుందా ఇల్లాలు. అసలేమీ జరగనట్లే రోజువారీ కార్యక్రమాలు చేసుకోమని రోజూలానే పిల్లలను పరామర్శించడం ఈ కవితలోని ఉదాత్తత. అంత అప్రమత్తతలో కూడా  పిల్లల తండ్రి ప్రస్తావన తేవడం.. ఆ తల్లికి పోయిన తన జీవితభాగస్వామి పైన ఉన్న అపరిమితమైన అనురాగాన్ని పట్టిస్తుంది ఈ కవిత.కుటుంబంలో జరిగే పెను విషాదాలు పసికూనలపై పడకూడదని, పోయినవాళ్లను గురించి ఎంత దుఃఖం పొర్లుతున్నప్పటికీ పెద్దలు తమ బాధ్యతగా పిల్లలతో ఎప్పటిలాగానే ప్రవర్తించాలన్న గొప్ప సందేశం ఈ పద్యంలని ప్రతి పాదంలోనూ కనిపిస్తుంది, కాబట్టే ఇది గొప్ప పద్యం అయింది. ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధిలో ఉండిపోయింది.   ఎంత మంచివాళ్లు పోయినా జీవితం ఆగకుండా ముందుకు  కొనసాగాల్సిందేనన్న చింతనను అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన ఈ పద్యం నా తెనుగు సేత ముందు.. ఆనక ఆంగ్ల మాతృక ఇక్కడ ఇస్తున్నా!కవిత కర్త ఎద్నా సైంట్ విన్సెంట్ మిలే (Edna St. Vincent Millay. కవిత పేరు లేమెంట్ (Lament)పోయినోళ్ళు ఎంత మంచివాళ్లు అయినా..-కర్లపాలెం హనుమంతరావు  కొసమెరుపుః ‘లైఫ్ ముస్ట్ గో ఆన్.. అని ఊరుకోకుండా.. ‘ఐ ఫరగెట్ జస్ట్ వై’  కర్త అనడం కవితను ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది.  చావు పుట్టుకలతో నిమిత్తం లేకుండా జీవితం కొనసాగుతూనే ఉండాలన్న నిత్యసత్యం ఊరడింపు వాక్యంగా తనకు తాను చెప్పుకోడం కోసం. ‘ఎందుకు అట్లా’ అనే తాత్విక సంశయం సహజంగానె పసి మెదళ్లలో మొలకెత్తక మానక మానదు. ఆ సందేహం తలెత్తి పసి మెదళ్ళు అయోమయం పాలవకుండా ‘ ఐ ఫర్ గెట్ జస్ట్ వై’ అని ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రకృతిలో జరిగే అన్ని సంఘటనలకు కారణాలు వెతకబోతే మనిషి మెదడుకు అందనివి ఎన్నో ఉండనే ఉన్నాయి కదా! -     కర్లపాలెం హనుమంతరావు    23 -07 -2021 - Unknown

Portrait of Edna St. Vincent Millay (1933-01-14) ఎందుకలా అని అడగద్దెవరూ!-కర్లపాలెం హనుమంతారావు- ఎద్నా సైంట్ విన్ సెంట్ మిలే ఆంగ్ల కవితకు నా తెలుగు సేత పిల్లల్లారా వినండర్రా మీ నాయన పోయాడివాళ ... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Fri, 23 Jul 2021 19:39:34 PDT
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger