Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 14 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౭౮(678) - Aditya Srirambhatla

( పిప్పలాయన భాషణ ) 11-57-సీ. "నరవర! విను జగన్నాథుని చారిత్ర- మెఱిఁగింతు నీమది కింపు మిగుల లసదుద్భవస్థితిలయ కారణంబయి- దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు- జ్వాలల ననలుండుఁ జనని పగిది నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు- పొరయక సుషిరంబుఁ బొందు, సత్య 11-57.1-తే. మనఁగ సత్త్వరజస్తమోమయగుణంబు, మహదహంకారరూపమై మహిమ వెలయు చేతనత్వంబు గలదేని జీవ మందు, రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును. భావము: "రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=11&Padyam=57 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 14 Nov 2022 15:51:21 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger