Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 15 November 2022

జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు - sarma

అత్తచుట్టం గూదపగ అత్తచుట్టం గూదపగ, అనేదోనానుడి. పాతకాలందే. ఏంటిదీ ఒక చిన్నకత చెప్పేసుకుందాం.సరేనా! అనగనగా ఒక పల్లెటూరు అందులో ఒక చిన్న కుటుంబం. ఒకడే కొడుకు. వయసొచ్చింది, పెళ్ళి చేసేరు. కో డలమ్మ ఒచ్చింది. కాలంగడిచి, ఇంటి యజమాని కాలం చేసేడు. కొడుకు ఇంటి యజమానయ్యాడు. అత్త స్థానం మారింది, యజమానురాలు నుంచి. కోడలికి అత్త చుట్టమే కాని రెండు పూటలా తింటోంది, చాకిరీ చేస్తున్నా, ఇది కోడలికి కంటకంగా ఉంది. ఏమీ చేయలేదు. కొంతకాలం గడిచింది, అత్త లొంగుబాటులో కొచ్చేసింది, ఆరోగ్య రీత్యా, కాని రెండుపూటలా తింటూనే ఉంది. కోడలు విసవిసలాడుతూ ముద్ద పడేస్తోంది. అలాగ అత్త చుట్టం గూద పగ అయ్యాయా కోడలికి. జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు ఇదీ ఒకనానుడే! పాతకాలందే!! జంతికొచ్చి చక్కిలాన్ని నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించింది. నేటికాలానికి ఇదేంటో తెలీదుకదా! మరిప్పుడంతా పిజ్జాలు బర్గర్లేగా తింటున్నది. జంతికల్నిచక్కిలాలని చూసినవారే అరుదైనట్టుంది. చక్కిలానికి లెక్కగా చిల్లులుంటాయి, జంతికకి లెక్కలేనన్ని చిల్లులుంటాయి. లెక్కగా చిల్లులున్న చక్కిలాన్ని లెక్కలేనన్ని చిల్లులున్న జంతిక నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించిందనమాట. ఎలా చెప్పినా నేటి కాలానికి అర్ధం చెయ్యడం కష్టమే కనక నేటి కాలం ఉ దాహరణ  బాగుంటుంది కదూ! ఒక జంతిక, చక్కిలం బ్లాగుల్లో కొంతకాలం కలిసున్నాయి. ఈ జంతిక బ్లాగుల్లోంచి పారిపోయింది, బుఱ్ఱలో గుంజెండిపోయి, రిపీట్ చెయ్యడానికి కూడా పాత గుంజులేక. . చక్కిలం ఇంకా కుంటుకుంటూ బ్లాగుల్లోనే ఉంది, పాతవి రిపీట్ చేస్తూనో, కొత్తవి రాస్తూనో. కొంతకాలంపోయాకా, ఒక పాత టపా రిపీట్ చేస్తే ఆ జంతిక, చక్కిలాన్ని బుర్రలో గుంజెండిపోయి, పాత టపాలు రీట్ చేస్తున్నాట్టా అని అడిగినట్టు.
Post Date: Tue, 15 Nov 2022 03:35:34 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger