శ్రీరామకథ - చిత్రకవిత్వం సాహితీమిత్రులారా! శ్రీరామకథ - చిత్రకవిత్వంలో సంస్కృతాంధ్ర రచనలు. శ్రీరామాయణగాథ ప్రభావం సాహిత్యప్రక్రియ లన్నిటిపై ఉందనడం సత్యదూరం కాదు. ప్రస్తుతం రామాయణ సంబంధిత రచనలలో చిత్రకవిత్వం విలసిల్లిన రచనలను నామ మాత్రంగ స్మరిద్దాం- శ్రీ మద్వాల్మీకి రామాయణం యుద్ధకాండలో----- శ్లో.మండలాని విచిత్రణి స్థానానివివిధానిచ, గోమూత్రికాదిచిత్రాణి గతప్రత్యాగతాని చ. - వా.రా.యుద్ధకాం,౪౦-౨౮ అనే శ్లోకంలో గోమూత్రికాబంధచిత్రవిశేషంవలె సైన్యం యుద్ధం చేసినారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. వివిధకవిపండితులురామాయణాన్ని సంస్కృతంలో చిత్రకవనంలో రచించినారు. ఆ పేర్లు ---- కవిపేరు చిత్రరచనపేరు వేంకటేశ్వర --రామయమకార్ణవః వేంకటేశ --రామచంద్రోదయం గోపాలార్య --రామచంద్రోదయం కృష్ణమోహన --రామలీలామృతం శ్రీకాంత --రఘూదయం చిదంబరకవి -శబ్దార్థచింతామణిః వేంకటాధ్వరి --రాఘవయాదవీయం దైవజ్ఞసూరి --రామకృష్ణవిలోమకావ్యం శ్రీకాంత --రఘూదయం నారాణభట్ట --నిరనునాసికచమ్పూః మల్లికార్జున --నిరోష్ఠ్యరామాయణం వేంకటార్య--శ్లేషచమ్పూరామాయణ ధనంజయ-రాఘవయాదవపాణ్డవీయ చిదమ్బరకవి -పంచకల్యాణచమ్పూః సన్ధ్యాకరనన్దినః --రామచరితం " -రాఘవయాదవపాణ్డవీయం వేంకటాచార్య-శ్లేషచమ్పూరామాయణ వేంకటేశ్వర-- చిత్రబన్ధరామాయణం వేంకటాచార్య-కంకణబన్ధరామాయణ కృష్ణకవి --క్రియాగోపనరామాయణం కృష్ణరాయ --ఆర్యాలంకారశతకం వీరరాఘవ --విశేషణరామాయణం రామభద్ర --రామస్తవప్రాసః నిట్టలఉపమాక} వేంకటేశ్వర } -రామాయణసంగ్రహః భాస్కరసూరి. --సీతారామీయం సుబ్రహ్మణ్యసూరి --రామావతారః సుబ్రహ్మణ్యసూరి --సీతాకల్యాణం సుబ్రహ్మణ్యసూరి-రామాయణడోలగీత ,, -ఆసేచనకరామాయణం వేంకటేశవామన --రామచన్ద్రోదయం ముడుమ్బై వేంకట }రామచన్ద్ర- రామనరసింహాచార్య} కథామృతం డా.కే.ఎస్.రామానుజాచార్య--శ్రీరామ బాణస్తవః - ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనవి. --------------------------------------- తెలుగుచిత్రకవనం-రామాయణం: దశరథరాజనందనచరిత్ర(నిరోష్ఠ్యం)-- -మరింగంటిసింగరాచార్య శుద్ధాన్ధ్రనిరోష్ఠ్యసీతాకల్యాణం--మరిం గంటి సింగరాచార్యులు నిరోష్ఠ్యసీతాకల్యాణం --పిడుపర్తి బసప్ప నిరోష్ఠ్యరామాయణం--సురపురంకేశవయ్య నిరోష్ఠ్యజానకీకల్యాణం--పోడూరి రామన శివరామాభ్యుదయద్వ్యర్థికావ్యం-- పోడూరి పెదరామామాత్య నిరోష్ఠ్యదాశరథిశతకం--మండపాక పేరయకవి నిరోష్ఠ్యదశరథతనయశతకం--వేదుల నారాయణకవి అచ్ఛాంధ్రనిరోష్ఠ్యనిర్గద్యదాశరథిచరిత్ర --హనుమంతరాయశర్మ నిర్వచనభారతగర్భరామాయణం-- రావిపాటిలక్ష్మీనారాయణ మొదలయినవి ప్రసిద్ధమైనవి వైద్యంవేంకటేశ్వరాచార్యులువారి సౌజన్యంతో
Post Date: Wed, 28 Dec 2022 13:47:28 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Wed, 28 Dec 2022 13:47:28 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment