Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 31 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౪(724) - Aditya Srirambhatla

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 11-119-క. దారుకుఁడు గనియె నంతటఁ జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌ మేరునగధీరు దనుజవి దారుని నేకాంతపరునిఁ దద్దయు నెమ్మిన్‌. 11-120-వ. కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె. 11-121-తే. నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ గన్నులను జూచి మమ్మును గారవింపు. భావము: ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు. "నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు." http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=121 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Tue, 31 Jan 2023 13:57:30 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger