Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 1 February 2023

ముక్కుమీద పద్యం - ఏ.వి.రమణరాజు

ముక్కుమీద పద్యం సాహితీమిత్రులారా! పారిజాతాపహరణం అనే కావ్యాన్నినందితిమ్మనరచించిశ్రీకృష్ణదేవరాయల వారికి అంకిత మిచ్చినాడు. నందితిమ్మన ముక్కును గురించి ఒక పద్యాన్ని   రచించినందుకు  ఆయనకు ముక్కుతిమ్మనఅనే వ్యవహారం కలిగిందని అంటారు.ముక్కును గురించిన ఆ పద్యాన్నితిమ్మనదగ్గర రామరాజభూషణుడు   కొంత ద్రవ్యంఇచ్చి కొని తన వసుచరిత్రయందుఉపయోగించుకున్నా డంటారు.ఆ పద్యం--- నానాసూనవితానవాసనల నా-నందించు సారంగ మే లా నన్నొల్లదటంచు గంధఫలి బ-ల్కాకం దపంబంది యో షా నాసాకృతి దాల్చి సర్వసుమన-స్సౌరభ్య సంవాసియై పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ - పుంజంబులిర్వంకలన్. పద్యం రామరాజభూషణకృతమే,ఐతే కొన్ని అపప్రచారాలు ఇలా ప్రచారమౌ తుంటాయి. అయితే---- ఈ పద్యానికిమూలమనదగినశ్లోకం పద్నాలుగవశతాబ్దంలోని అగస్త్యుని 'నలకీర్తికౌముది' అనే కావ్యంలో ఉంది. ఆ శ్లోకం----- "భృంగా నవాప్తి ప్రతిపన్న భేదా కృత్వా వనే గంధఫలీ తపోలం, తన్నాసికాభః దనుభూత గంధా స్వపార్శ్వ నేత్రీ కృత భృంగ సేవ్యా" వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో
Post Date: Wed, 01 Feb 2023 13:05:18 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger