కమే! కమే!! కమే!!! ఎక్కడజూసినా కమే మాటే! కమే ఏంజెయ్యగలదయ్యా? అడిగేడో జ్ఞిజ్ఞాసువు ఏమైనా చెయ్యగలదన్నాడో మేధావి. కొన్ని ఉజ్జోగాలే పోతాయన్నాడు మరొకడు. అదేంజేయగలదు? ఏం ఉజ్జోగాలో పొతాయో చెప్పరాదే అడిగేడు మరో పెద్దమడిసి. ఇనుకోండి. లెక్కల్లో బొక్కలు సిటికలో కనిపేట్టస్తది. అక్కౌంటెంట్లు, ఆడిటర్ల పని కాళీ! గ్రంధాలు, ఉద్గ్రంధాలు రాసేయగలదు, కవులు కళాకారులు పని ఖాళీ! ఇలా జెప్పినియ్యి కొన్నే!సమస్యలు చిటికిలో విడదీసెయ్యగలదు.ఏమైనా చేసెయ్యగలదు, చెప్పేసేడు. ఇలా చాలా చాలా పనులు చేసెయ్యగలదు, చాలా ఉజ్జోగా లు హాంఫట్, బెదిరించేడు. ఐతే చెయ్యలేనిదేం లేదంటావ్? అడిగేడు మరో అనుమానం పక్షి. దానే అడిగేదాం అనేసేడు ఒక విజ్ఞాని. ఉదాహరణ చెబుతా వినండి. ఒక జడ్జీగారు తను ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండాలో అని కమేని అడిగితే ఆయనేమని రాసేడో తీర్పు అలాగే చెప్పేసిందిట. అదిజూసి ఆయన నోరొదిలేసేడంట. ఆయనేజెపిండు, ఇటు సెయ్యద్దూ, ప్రమాదమూ అని. మరో ముచ్చట. ఒకయనో ముచ్చటజెప్పిండంట, సేనాకాలం కితం. అది వివాదం అయ్యిందంట, నాడు. నేడు కమేని అడిగితే ఈన జెప్పిందే నిజమన్నదంట. ఆయనో డప్పేసుకుని జెప్పుకుంటాన్నాడు. ఐతే కొన్ని కొచ్చన్లేదాం ఏటి జెప్పుద్దో! 2024 లో మోడీగారు ప్రధానిగా ఎన్నిక కాకపోతే ఏం జేసుకు బతగ్గలడు? హిమాలయాల్లో టీ అమ్ముకుని ఐనా బతికెయ్యగలడని ఆన్సరు. 2024 లో రాహుల్ బాబా ప్రధానిగా ఎన్నిక కాలేకపోతే ఏ0 చేసిబతగ్గలడు? ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేకపోయిన బతికెయ్యగలడు ఆన్సరు. అమ్మాయి నీళ్ళడుతోంది ఏబిడ్డ? Input డాటా ఇనకంప్లీట్, ఆన్సరు. నువ్వు చెయ్యలేనిదేంటో చెప్పూ? కొన్ని నిమిషాలే మౌనం. ఏమైందీ అని భయపడ్డారు, జనం. నోరిప్పింది కమే, పిడక పజ్యాలు రాయలేను, ఆన్సరు. ఇది చదివి నవ్వుకోండి. ఏవరికైనా బాధ కలిగితే బాధ్యత నాది కాదు కమేదేస్మీ! So many errors, correct them yourself :)
Post Date: Sun, 09 Apr 2023 03:36:21 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 09 Apr 2023 03:36:21 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment