కవిమిత్రులకు నమస్కృతులు. డెబ్బైమూడేళ్ళ వయస్సులో ఉన్న నేను కొంతకాలంగా తరచూ అనారోగ్యం పాలవుతున్న కారణంగా మీ పూరణ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మాటిమాటికి జ్వరం వచ్చి పోతూ ఉండడం, దానితో పూర్తిగా నీరసించిపోవడం కారణంగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ప్రయాణాలు చేయలేక ఈమధ్య కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడ వెళ్ళలేకపోయాను. డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడుతున్నాను. ఆరోగ్యం కుదుట పడగానే మీ పద్యాలను సమీక్షిస్తాను. ఎంతో ఆసక్తితో, కష్టపడి వ్రాసిన పద్యానికి స్పందన కరువైతే ఎంత నిరుత్సాహ పడతామో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే నేను అనారోగ్యంతో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా మిత్రులను పరస్పర గుణదోష విచారణ చేసుకొనవలసిందిగా కోరుతూ ఉంటాను. నా అశక్తతను గుర్తించి నిరుత్సాహ పడకుండా మీరంతా క్రమం తప్పకుండా సమస్యాపూరణలు చేస్తూ ఉండాలని, మిత్రులు పరస్పర సమీక్షలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ నన్ను మన్నించమని కోరుకుంటున్నాను.
Post Date: Wed, 17 May 2023 14:37:02 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Wed, 17 May 2023 14:37:02 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment