Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 December 2014

వాజపేయి, మాలవ్యకు భారత రత్న ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

వాజపేయి, మాలవ్యకు భారత రత్న ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


వాజపేయి, మాలవ్యకు భారత రత్న

Posted: 24 Dec 2014 10:20 PM PST

రచన : | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: భారత రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన పాలనాదక్షుడు, సయోధ్య రాజకీయ ప్రవక్త, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నకు ఎంపికయ్యారు. అలాగే హిందూ మహాసభ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యకు ఈ విశిష్ట పురస్కారాన్ని కేంద్రం ప్రభుత్వం అందించింది. వాజపేయికి భారత రత్న అవార్డును ప్రదానం చేయడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమైనాయి. మరో 24 గంటల్లో వాజపేయి 90వ జన్మదినోత్సవాన్ని, లాగే మాలవ్య 153వ జయంతిని జరుపుకోనున్న సందర్భంగా ఈ పురస్కారాలను క... పూర్తిటపా చదవండి...

చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన

Posted: 24 Dec 2014 10:13 PM PST

రచన : | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

ఖన్నాసర్ – సన్నపాటి దర్జీ

Posted: 24 Dec 2014 08:06 PM PST

రచన : | బ్లాగు : మోదుగు పూలు
సంవత్సరన్నర తరువాత చండీఘర్ లో మళ్ళీ ప్రవేశం.పాత వాసనలను గుండె నిండా పీల్చుకొంటూ తిరుగుతున్నాను. గతంలో వేసిన అడుగు అచ్చుల్లో మళ్ళీ అవే పాదాలు వేసి ఆ రోజు ఆలోచించిన ఆలోచనలను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. చెట్లు ఆకాశంలో కబుర్లు చెప్పుకొనే చోట, గడ్డి చీల్చిన గతుకుల బాటల్లో ఆ నాటి అనుభూతులు వెదుక్కొంటున్నాను. సుఖనా లేక్ అలలను సుధీర్ఘంగా చూస్తూ చాలా సేపు నిలబడ్డాను. కొంత సంతోషం, కొంత పరవశం, కొంత దిగులు, కొంత అసంతృప్తి, కొంత […]... పూర్తిటపా చదవండి...

గ్రీకు పురాణాలలోనూ అప్సరసలు ఉన్నారు!

Posted: 24 Dec 2014 07:36 PM PST

రచన : | బ్లాగు : కల్లూరి భాస్కరం
"సిర్సే నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆమె మీదికి కత్తి దూయి. అప్పుడామె వెనక్కి తగ్గి తనతో పడక సుఖాన్ని అనుభవించమని కోరుతుంది. అందుకు సందేహించకు. తన అందచందాలతో ఆమె నిన్ను అలరించి సుఖపెడుతుంది. అయితే నీపట్ల ఎలాంటి మోసానికీ పాల్పడనని ముందే దేవుడి సాక్షిగా ఆమె చేత ప్రమాణం చేయించు. ముఖ్యంగా ఆమె నిన్ను పూర్తి నగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ససేమిరా ఒప్పుకోకు" అన్నాడు.
పూర్తిటపా చదవండి...

శ్రీకరంచ పవిత్రంచమహత్ శోక నివారణమ్. మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 24 Dec 2014 07:23 PM PST

రచన : | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. శ్రీకరంచ పవిత్రంచ మహత్ శోక నివారణమ్.
లోకే వశీకరం పుంసాం, భస్మం త్రైలోక్య పావనమ్. 
గీ. శ్రీకరంబు, పవిత్రము, శోక హారి,
లోకమును పుంస జాతికి లొంగఁ జేయు,
మహిత త్రైలోక్య పావన మహిని భూతి.
భస్మధారణ పురుషుల వరలఁ జేయు.
భావము. లోకమున మంగళప్రదమైనదియు, పవ... పూర్తిటపా చదవండి...

దర్శ నీయ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు 28-పరాసు పేట- సమర్ధ రామ దాసు ప్రతిష్టించిన –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి

Posted: 24 Dec 2014 07:12 PM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

    దర్శ నీయ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు

                          28-పరాసు పేట- సమర్ధ రామ దాసు ప్రతిష్టించిన –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి

కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో పరాసుపేటలో శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి దేవాలయం సుప్రసిద్ధ మైనది .1650లో నిర్మింప బడిన మూడు వందల అరవై అయిదేళ్ళ గొప్ప దేవాలయం .శివాజీ మహారాజ్ గురువు సమర్ధ రామ దాసు గారు ప్రతిష్టించినట్లు స్థానిక కధనం .ఆలయం కొంత శిదిలమైతే 2001మాఘ మాసం లో పునర్నిర్మించ బడింది .ఆలయ నిర్మాణం జరిగిన చోటును మారుతాత్మజుడు స్వయ... పూర్తిటపా చదవండి...

ఇక ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులు

Posted: 24 Dec 2014 06:25 PM PST

రచన : | బ్లాగు : విశ్వ
రెండు నెలల క్రితం ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులుచేసుకుంటాము అన్న భారత టెలికాం ఆపరేటర్ల ప్రతిపాదనని ట్రాయ్ బుట్టదాఖలు చేసినప్పటికి వారి ఏర్పాట్లలో వారుఉన్నారు. వాట్స్‌అప్‌, స్కైప్, వైబర్, హాంగవుట్స్ వంటి అప్లెకేషన్‌లు ద్వారా వాడుకున్న డాటా మన ప్రస్తుత డాటా పధకంలోకి రాకుండా దానికి ప్రత్యేకమైన చార్జిలు విదిస్తారు. భారత అగ్రగామి నెట్‌వర్క్ ఏయిర్ టెల్ ఎప్పటిలాగే ముందు బాదడానికి ముందుకు రాగా మిగిలినవారు దానిని అనుసరించబోతున్నారు. దానికి సంభందించిన చిత్రాలు చూడండి.

రుక్మిణీకల్యాణం - ఇట్లు మేఘమధ్యంబు

Posted: 24 Dec 2014 04:55 PM PST

రచన : | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger