Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 5 February 2023

మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ - అంటే ఏమిటి? - ఏ.వి.రమణరాజు

మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ - అంటే ఏమిటి? సాహితీమిత్రులారా! ఒక సాహితీమిత్రునికి శ్రీనాథ మహాకవి అంటే వీరాభిమానం. నాకేమో బమ్మెరపోతన అంటే భక్తి, అభిమానం. అతడొకపర్యాయం నాతో ఇలా అన్నాడు- మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ. - అంటే ఏమిటీ అని అడిగినాడు. ఇదేదో సాంకేతికాక్షర  సముదాయంలా  ఉంది అన్నాను. కరెక్ట్ రూట్ లోనేఉన్నావ్,ప్రయత్నించు అన్నా డతడు. నాకు స్ఫురించలేదు. అతడు ఇలా చెప్పినాడు-- 'మరు'       - మరుత్తరాట్చరిత్ర 'శా'        - శాలివాహనసప్తశతి 'పం'       - పండితారాధ్యచరిత్ర 'కాశీ'       - కాశీఖండం 'ధ'         - ధనంజయవిజయం 'నం'       - నందనందనచరిత్ర 'ప'         - పల్నాటి వీరచరిత్ర 'హ'       -హరవిలాసం 'శి'          - శివరాత్రి మాహాత్మ్యం 'క్రీడా'     - క్రీడాభిరామం 'శృంగార'  - శృంగారనైషధం 'భీమ'    - భీమఖండం ఇంతేనా! ఇంకాకొంచెం ఆలోచించి ఉంటే  తప్పక  గుర్తించేవాణ్ణి,  అంటూ నేను   *భోవీనామ*  అంటే  ఏమిటీ! అన్నాను,ఇదేదో రాజీనామా మాదిర ఉంది అంటూ నవ్వులు రువ్వినాడు. ఒరేయ్ నీ బాటలోనే నడిచినాను, నీవు చెప్పినదే నిన్ను మార్పుచేసి అడుగుతున్నాను. మా  మహాకవి బమ్మెరపోతన గ్రంథాల పేర్లు అంటూ--- భో ---భోగినీదండకం వీ  ---వీరభద్రవిజయం నా---నారాయణశతకం మ---మహాభాగవతం అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. జరిగిన సంఘటన వైద్యం వారి సౌజన్యంతో
Post Date: Sun, 05 Feb 2023 06:21:30 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger